కార్తి.. ఏం ఎగిరాడండీ బాబూ

Update: 2015-10-19 07:46 GMT

Full View
బహుశా కార్తి తన సినిమా సూపర్ హిట్టయినపుడు కూడా ఇంత ఆనందంతో ఎగిరి గంతేసి ఉండడేమో. నడిగర్ సంఘం ఎన్నికల్లో కోశాధికారిగా 400 ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించాడు కార్తి. ఈ ఆనందంలో ఎన్నికలు జరిగిన స్కూల్ ప్రాంగణంలో కార్తి చేసిన హడావుడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆనందం పట్టలేక మామూలు కుర్రాడిలా డ్యాన్సులేశాడు కార్తి. ఆ ఆనందంలో ఉన్న అతడికి విశాల్ కనిపించగా.. గెంతుతూ గెంతుతూ వెళ్లి అతడికి మీదికి ఎక్కేసి సంబరాలు చేసుకున్న వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నాజర్ వర్గం విజేతల్లో అత్యంత భారీగా గెలిచింది కార్తినే. అతను ఎస్ఎస్ఆర్ కన్నన్ ను ఓడించాడు. కార్తికి 1493 ఓట్లు రాగా.. కన్నన్ కు 1080 ఓట్లే వచ్చాయి. ఐతే ముందు కార్తి కూడా వెనకబడ్డాడు. కన్నన్ ఐదొందల ఓట్లలో ఉంటే.. కార్తికి అప్పటికి 300 ఓట్లే వచ్చాయి. నాజర్ వర్గంలోని మిగతా వాళ్లలాగే కార్తికి కూడా ఓటమి తప్పదని అనుకున్నారు. కానీ ముందు విశాల్ ముందంజ వేయగా.. ఆ తర్వాత కార్తి కూడా నెమ్మదిగా పుంజుకున్నాడు. కోలీవుడ్లో కార్తి కుటుంబానికి చాలా మంచి పేరుంది. అన్నయ్య సూర్య, తండ్రి శివకుమార్ లకు మంచి గౌరవముంది. అది కలిసొచ్చి కార్తి భారీ విజయం సాధించాడు. ఎన్నికలకు ముందు చాలామంది కార్తి అమాయకుడని.. అతణ్ని విశాల్ ఉచ్చులోకి లాగాడని.. ఎమోషనల్ గా అతణ్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ పని చేయలేదు.
Tags:    

Similar News