విభిన్నమైన సినిమాలతో హీరోగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపుతో పాటు మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు హీరో కార్తి. 'ఖైదీ' సంచలన విజయంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన ఈ తమిళ స్టార్ రీసెంట్ గా పీఎస్ మిత్రన్ డైరెక్షన్ లో 'సర్దార్' మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో తలెత్తనున్న వాటర్ చుట్టూ ఊహించని విధంగా భారీ స్థాయిలో బిజినెస్ జరగబోతోందని, సామాన్యుడికి భవిష్యత్తులో నీటి చుక్క కూడా దొరకదనే కతతో ఓ స్పై థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది.
రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లని రాబడుతూ అనూహ్య విజయం దిశగా పయనిస్తోంది. కార్తి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీతో కార్తి హీరోగా మరో మెట్టు ఎక్కేశాడు. ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో హీరో కార్తి మరో కొత్త తరహా సినిమాకు శ్రీకారం చుట్టాడు. తనకు 'ఖైదీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో కార్తి తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు.
గతంలో ఇదే సంస్థలో కార్తి 'శకుని', కశ్మోరా, ఖాకీ, ఖైదీ, సుల్తాన్ వంటి సినిమాలు చేశాడు. ఈ సంస్థలో ప్రస్తుతం కార్తి చేస్తున్న సినిమా ఆరవది. ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ లో రాజు మురుగన్ రూపొందించిన 'జోకర్' ఉత్తమ తమిళ చిత్రంగా 2016లో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అలాంటి దర్శకుడితో కార్తి సినిమా చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు 'జపాన్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇది కార్తి నటిస్తున్న 25వ చిత్రం కావడం విశేషం. ఇందులో కార్తికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా ఇటీవల 'పుష్ప'లో మంగళం శ్రీనుగా నటించిన సునీల్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ మూవీతో సునీల్ తమిళ చిత్ర సీమకు పరిచయం అవుతుండటం గమనార్హం. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారి నటుడిగా పరిచయం అవుతూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, రవివర్మన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్ గా వినేష్ రాజ్ వర్క్ చేయబోతున్నారు. మంగళవారం ఈ మూవీని చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో తొలి షెడ్యూల్ ని ప్రారంభించి ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. ఇందకీ 'జపాన్' కథేంటీ? ..జపాన్ లో కార్తీ ఏం చేయబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లని రాబడుతూ అనూహ్య విజయం దిశగా పయనిస్తోంది. కార్తి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీతో కార్తి హీరోగా మరో మెట్టు ఎక్కేశాడు. ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో హీరో కార్తి మరో కొత్త తరహా సినిమాకు శ్రీకారం చుట్టాడు. తనకు 'ఖైదీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో కార్తి తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు.
గతంలో ఇదే సంస్థలో కార్తి 'శకుని', కశ్మోరా, ఖాకీ, ఖైదీ, సుల్తాన్ వంటి సినిమాలు చేశాడు. ఈ సంస్థలో ప్రస్తుతం కార్తి చేస్తున్న సినిమా ఆరవది. ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ లో రాజు మురుగన్ రూపొందించిన 'జోకర్' ఉత్తమ తమిళ చిత్రంగా 2016లో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అలాంటి దర్శకుడితో కార్తి సినిమా చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు 'జపాన్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇది కార్తి నటిస్తున్న 25వ చిత్రం కావడం విశేషం. ఇందులో కార్తికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా ఇటీవల 'పుష్ప'లో మంగళం శ్రీనుగా నటించిన సునీల్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ మూవీతో సునీల్ తమిళ చిత్ర సీమకు పరిచయం అవుతుండటం గమనార్హం. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారి నటుడిగా పరిచయం అవుతూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, రవివర్మన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్ గా వినేష్ రాజ్ వర్క్ చేయబోతున్నారు. మంగళవారం ఈ మూవీని చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో తొలి షెడ్యూల్ ని ప్రారంభించి ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. ఇందకీ 'జపాన్' కథేంటీ? ..జపాన్ లో కార్తీ ఏం చేయబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.