అలా చేయడం చావుతో సమానం-కార్తి

Update: 2016-10-31 09:30 GMT
రొటీన్ సినిమాలు చేయడం అంటే తనకు మహ చెడ్డ చిరాకంటున్నాడు కార్తి. ఒకే తరహా పాత్రల్లో నటించడం అంటే చావుతో సమానం అంటూ పెద్ద స్టేట్ మెంటే ఇచ్చాడు కార్తి. తన కొత్త సినిమా ‘కాష్మోరా’ ఫలితం చాలా ఆనందాన్నిస్తోందని.. తామంతా కలిసి ఓ అద్భుతాన్ని సృష్టించామని ఫీలవుతున్నామని కార్తి అన్నాడు. ఇంకా కార్తి ఏం చెప్పాడంటే..

‘‘దర్శకుడు గోకుల్‌ తో కలిసి మేమంతా ఓ అద్భుతాన్ని సృష్టించామని భావిస్తున్నాం. నా కెరీర్ లో కాష్మోరా వైవిధ్యమైన చిత్రం. నాకు ఒకే తరహా పాత్రల్లో నటించడం ఇష్టముండదు. అలా చేయడం అంటే చావుతో సమానం. ఈ సినిమాతో కొత్తగా కనిపించే అవకాశం లభించింది. ఈ సినిమాలో కీలకమైన రాజనాయక్ పాత్ర కోసం చాలా శ్రమించాం. నా కెరీర్లో చేసిన పాత్రలన్నింట్లోకి ఇది ప్రత్యేకమైంది.

డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన గోకుల్ రెండు సినిమాల అనుభవంతో ‘కాష్మోరా’ లాంటి భారీ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కథ కంటే ముందు రాజనాయక్.. కాష్మోరా పాత్రల గురించి చెప్పాడు. ఆ పాత్రల గురించి చెప్పగానే సినిమా ఒప్పుకున్నా. గోకుల్ చేతబడి చేసేవాళ్ల జీవితాల్ని అధ్యయనం చేశాకే ఈ స్క్రిప్టు రాశాడు. అందుకే సన్నివేశాలు రియలిస్టిగ్గా ఉంటాయి. ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి’’ అని కార్తి అన్నాడు. దీపావళికి ధనుష్ సినిమాతో పోటీ పడటం గురించి స్పందిస్తూ.. తనకు ఇండస్ట్రీలో ఎవరితోనూ పోటీ లేదని.. తన గత సినిమాతోనే తన కొత్త సినిమాకు పోటీ అని కార్తి చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News