కోలీవుడ్ కార్తి లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక అందాల భామ పక్కన చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటో చూసి కార్తీతో ఉన్నది ఎవరా అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలు పెట్టారు. అంతేకాదు కార్తీ ఈమె కరీనా చోప్రా అంటూ కామెంట్ పెట్టడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇంతకీ కార్తీ పక్కన ఉన్నది ఎవరని కాస్త క్షుణ్ణంగా చూస్తే అది ఆడ వేషం వేసుకున్న కమెడియన్ సంతానం అని తెలుస్తుంది.
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం అక్కడ స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించాడు. తమిళ సినిమాల్లో హీరో పక్కన పాత్ర అంటే అది ముందు సంతానం దగ్గరకు వచ్చిన తర్వాతే మరో నటుడి దాకా వెళ్తుంది.
కమెడియన్ గా తన మార్క్ నటనతో సంతానం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఎన్నాళ్లని ఇలా కామెడీ రోల్స్ వేస్తాం మనం కూడా లీడ్ రోల్స్ చేయాల్సిందే అని ఒకరోజు డిసైడ్ అయ్యాడు. అలా 2013 లో కన్నా లడ్డు తిన్న అసయ్య సినిమాతో హీరోగా మారాడు. లీడ్ రోల్ చేయడమే కాదు నిర్మాతగా కూడా మారి సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు సంతానం.
ఇక అప్పటి నుంచి వేరే హీరోల సినిమాల్లో చేయడం మానేసి తనే లీడ్ రోల్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు సంతానం. లాస్ట్ ఇయర్ కూడా గులు గులు, ఏజెంట్ కన్నయిరాం సినిమాలతో తమిళ ప్రేక్షకులను అలరించాడు సంతానం. ప్రస్తుతం కిక్, డీడీ రిటర్న్ సినిమాల్లో నటిస్తున్నాడు సంతానం. కేవలం తన సినిమాలన్నీ తమిళంలోనే రిలీజ్ అవడం వల్ల దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు ఆడియన్స్ కు దూరమయ్యాడు సంతానం.
లేటెస్ట్ గా కార్తీ సంతానం లేడీ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ కరీనా చోప్రా అని కామెంట్ చేయడంతో మరోసారి తెలుగు మీడియాలో సంతానం వైరల్ గా మారాడు. తను చేసిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వట్లేదు కానీ సంతానం అంటే తెలుగు ఆడియన్స్ లో కూడా అభిమానం ఉంది.
మన దగ్గర సునీల్ కమెడియన్ నుంచి హీరోగా మారి అలా సక్సెస్ అవలేక మళ్లీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్నాడు. కానీ కోలీవుడ్ లో మాత్రం సంతానం హీరోగా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు.