హోటల్ బిజినెస్ లో హీరోయిన్ బిజీ

Update: 2015-10-25 13:30 GMT
ఏ ముహూర్త‌న సినిమాల్లోకి అడుగుపెట్టారో గానీ అల‌నాటి హీరోయిన్ రాధ కూతుళ్లు కార్తిక‌ - తుల‌సి ఇద్ద‌రు నిల‌దొక్కుకోలేక‌పోయారు. పెద్ద నిర్మాణ సంస్థ‌లు, అగ్ర ద‌ర్శ‌కుల సినిమాల‌తోనే ఎంట్రీ జ‌రిగిందిగానీ ఏ  ఒక్క‌రికి క‌లిసి రాలేదు. నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య జోష్ సినిమా తో కార్తిక హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది. మ‌ణిరత్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌డలి సినిమాతో తుల‌సి  నాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. అయినా ఏం లాభం ఇద్ద‌రు ఫేడౌట్ అయిపోయారు. దీంతో కుతుళ్ల కోసం రాధ శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేసింది. టాలీవుడ్ - కోలీవుడ్ ల‌లో త‌న‌కు తెలిసిన వారంద‌ర్ని ట‌చ్ చేసింది గానీ, ఎవ‌రు అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. అందుకే ఇక పెద్ద కూతురు కార్తిక బిజినెస్ రంగంలోకి దిగాల‌ని అనుకుంటుంది.

తండ్రి ఎలాగు హోట‌ల్ బిజినెస్ లో ఉన్నారు. ఆయ‌న ప్లైట్  క్యాట‌రింగ్ - ఉద‌య స‌ముద్ర బీచ్ రె స్టారెంట్స్ - స్టార్ ల‌గ్జ‌రీ హోట‌ల్స్ ను సొంతంగా ర‌న్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల అనుభ‌వం ఉంది. అందుకే ఆ వ్యాపారాల‌లో కొన్ని బాధ్య‌త‌ల్ని కార్తిక‌ చేప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం.  అమ్మ‌డు కూడా యూకే బేస్ డ్ యూనివ‌ర్సిటీ నుంచి హోట‌ల్ మేనేజ్ మెంట్ లో  ప‌ట్టా పొందింది. అందుకే ఇక పూర్తిగా స‌మ‌యమంతా బిజినె స్ కే కేటాయించాల‌నుకుంటోంది. ఆమె చివ‌రిసారిగా తెలుగులో అల్ల‌రి నరేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళ్లి చిత్రంలో న‌టించింది. అటు త‌మిళ్ లో కూడా పూర్తిగా ఖాళీ అయిపో యింది.
Tags:    

Similar News