ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ లో ఆఫర్ అంటే ఆషామాషీనా? ఆ బ్యానర్ లో అవకాశం వస్తే అదృష్టం కలిసొచ్చినట్టే. ఆ అవకాశం కోసం ఎందరో యువహీరోలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తుంటారు. కొందరైతే ఒక్క ఛాన్స్ ప్లీజ్! అని కూడా అడిగేస్తుంటారు. ఆ అరుదైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్నానని అంటున్నారు ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ. గుణ 369 ప్రచార ఇంటర్వ్యూలో కార్తికేయ ఈ ఆఫర్ గురించి స్పందించారు.
మొన్న అరవింద్ గారు వేదికపైనా ఆఫర్ ఇచ్చినట్టున్నారు? అని ప్రశ్నిస్తే కార్తికేయ అందుకోసమే ఎగ్జయిటింగ్ గా ఉన్నానని తెలిపారు. ఆ రోజు గుణ వేదికపై బోయపాటి -అల్లు అరవింద్ గారు సినిమా ప్రకటిస్తే `సార్.. నాక్కూడా` అని అన్నాను. వెంటనే ఆయన వెల్ కమ్ అన్నారు. నిజంగా ఆయన వెల్ కమ్ చెబితే చాలా సంతోషిస్తాను కదా.. అన్నారు.
గీతా ఆర్ట్స్ తో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిరంతరం కథల వంటకం సాగుతుంటుంది. కథ పూర్తిగా రెడీ అయ్యాక కొన్నిసార్లు హీరోని ఎంపిక చేస్తారు. ఆ కథకు సరిపోయే హీరో కోసం వెతుకుతారు. అలా కాకుండా సక్సెస్ లో ఉన్న హీరోని బట్టి కథను తయారు చేయడం అన్నది ఒక పద్ధతి. ఈ రెండిటిలో నిష్ణాతులు అక్కడ ఉన్నారు. అయితే కార్తికేయ కోసం కథ రెడీ చేశారా? లేదా? అతడికి ఆఫర్ ఉందా లేదా? అన్నది అట్నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది. హిప్పీ ఫ్లాపవ్వడం కొంతవరకూ మైనస్. గుణతో నిరూపిస్తానని అంటున్నాడు. ఈ సినిమా అతడికి టెస్ట్ లాంటిది. హిట్టయితే గీతా ఆర్ట్స్ లో ఛాన్సుంటుందేమో!