కార్తికేయ యుగాంతం ఇదో ప్ర‌యోగాం!

Update: 2022-12-01 04:23 GMT
టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన యువ కెర‌టం కార్తికేయ గుమ్మ‌డికొండ‌. తొలి సినిమా 'ఆర్ ఎక్స్ 100' చిత్రంతోనే యూత్ హీరోగా మారిపోయాడు. సినిమా స‌క్సెస్  స‌హా రొమాంటిక్ స‌న్నివేశాలు యువ‌త‌కి క‌నెక్ట్ అవ్వ‌డంతో తొలి సినిమాతోనే యూత్ ఫాలోయింగ్ ని ద‌క్కించుకున్నాడు. అటుపై చేసిన కొన్నిప్ర‌య‌త్నాలు ప‌ర్వాలేద‌నిపించాయి.

'90 ఎమ్ ఎల్'..'చావుక‌బురు చ‌ల్లగా' లాంటి  సినిమాలు యూత్  ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్  గా  నిలిచాయి. ఇదే స‌మ‌యంలో కోలీవుడ్ లో సైతం అవ‌కాశాలు అందుకుని మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు. త‌ల అజిత్ కే ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించాడు. హీరో అనే ఇమేజ్ చ‌ట్రంలో ఇరుకోక్కుండా వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు.

కుర్రాడు హీరో మెటీరియ‌ల్ కావ‌డంతో మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గ‌జాల దృష్టిలోనూ త‌క్కువ టైమ్ లోనే ప‌డ్డాడు. మెగాస్టార్ తో వేదిక‌ను పంచుకునే అవ‌కాశం వేగంగానే వ‌చ్చింది.  కానీ ఇప్పుడా  యంగ్ హీరో ట్రాక్ చూస్తే వేగం త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తుంది. కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్న‌ట్లు లేదు. ప్ర‌స్తుతం చేతిలో ఒకే ఒక్క సినిమా క‌నిపిస్తుంది.  

క్లాక్స్ అనే కొత్త‌కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న 'బెదురులంక‌ 2012' అనే  సినిమా చేస్తున్నాడు. ఇది  ఓప్ర‌యోగాత్మ‌క చిత్రంగా తెలుస్తోంది. 2012 యుగాంతంలో నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన‌న చిత్ర‌మిది. టాలీవుడ్ లో ఇంత వ‌ర‌కూ ఇలాంటి ప్ర‌యోగాలు చేసింది లేదు. కేవ‌లం హాలీవుడ్ కే పరిమిత‌మైన జోన‌ర్ల‌వి.  ఆ ర‌కంగా ఇది  తెలుగులో స‌రికొత్త అటెంప్ట్ అని చెప్పొచ్చు.

2012 యుగాంతం ఖాయ‌మంటూ జ‌రిగిన ప్ర‌చారాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్నారు. యుగాతం కాకపోయినా మీడియాలో క్రియేట్ అయిన హైప్ కి ప్ర‌జ‌ల్లో  ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయి అన్న‌ది హైలైట్ చేస్తున్న‌ట్లు  తెలుస్తోంది. ప్రేక్ష‌కుల్ని బెదురులంక అనే కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్ల‌బోతున్నారుట‌. కాకినాడ‌..యానాం..గోదావ‌రి ప‌రిస‌ర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ కొత్త ప్ర‌పంచ‌లో ద‌ర్శ‌కుడు త‌న‌దైన శైలిలో కామెడీ కూడా పంచ‌బోతున్నాడుట‌. మ‌రి ఆ క‌థేంటో తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా స‌క్సెస్ కూడా కార్తికేయ‌కి అనివార్య‌మే. త‌న ఇమేజ్ తో  ప్రేక్ష‌కుల్ని  థియేట‌ర్ కి ర‌ప్పించ‌గ‌ల‌గాలి. క‌నీస ఓపెనింగ్స్ సాధించ‌గ‌ల్గితే మార్కెట్ లో నిల‌బ‌డొచ్చు.  పోటా వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకుని నిల‌బ‌టం అంత ఈజీ కాదన్న‌ది గ్ర‌హించాలి సుమీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News