‘రాయుడు’ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడే

Update: 2017-03-25 09:57 GMT
‘కాటమరాయుడు’ సినిమాకు వచ్చిన హైప్.. ఆ సినిమాను రిలీజ్ చేసిన తీరు చూసి కచ్చితంగా తొలి రోజు టాలీవుడ్ వసూళ్ల రికార్డులు బద్దలైపోతాయనే అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఈ సినిమా పవన్ కెరీర్లో హైయెస్ట్ డే-1 వసూళ్లు సాధించింది కానీ.. ఆల్ టైం రికార్డును కొట్టలేకపోయింది. కొన్ని ఏరియాల వరకు ‘ఖైదీ నెంబర్ 150’ పేరిట ఉన్న ఆల్ టైం రికార్డును బద్దలు కొట్టిన ‘కాటమరాయుడు’ ఓవరాల్ కలెక్షన్లలో మాత్రం ‘ఖైద నెంబర్ 150’.. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.22.27 కోట్ల షేర్.. రూ.28.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

రిలీజ్ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 90 శాతానికి పైగా ‘కాటమరాయుడు’తోనే నిండిపోయాయి. అందులోనూ హైదరాబాద్ లాంటి చోట్ల అయితే 95 శాతానికి పైగా థియేటర్లలో ‘కాటమరాయుడు’తోనే నడిపించారు. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తొలి రోజు ఐదు షోల చొప్పున పడ్డాయి. ఆంధ్రాలో అయితే భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు వేశారు. రోజుకు మొత్తం ఆరు షోల చొప్పున ‘కాటమరాయుడు’ సినిమాను నడిపించారు. కాబట్టి తొలి రోజు డివైడ్ టాక్ కలెక్షన్లపై ప్రభావం చూపదనే అంచనా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ టాలీవుడ్ డే-1 రికార్డుల్ని బద్దలు కొట్టి తీరుతుందని భావించారు. కానీ ఆంధ్రా ప్రాంతం వరకు ఓవరాల్ గా.. కొన్ని ఏరియాల్లో ఆల్ టైం రికార్డుతో సంతృప్తి చెందిన ‘కాటమరాయుడు’ ఓవరాల్ గా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ‘కాటమరాయుడు’ షేర్స్ ఏరియాల వారీగా..

నైజాం (తెలంగాణ)-రూ.4.12 కోట్లు

సీడెడ్‌ (రాయలసీమ)-రూ.2.85 కోట్లు

వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.3.01 కోట్లు

తూర్పు గోదావ‌రి-రూ.3.56 కోట్లు

గుంటూరు-రూ.2.97 కోట్లు

కృష్ణా- రూ.1.52 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.2.91 కోట్లు

నెల్లూరు-రూ.1.33 కోట్లు

ఆంధ్రా-రూ.15.3 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి షేర్-రూ.22.27 కోట్లు; గ్రాస్-రూ.28.1 కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News