మీటూ : సాక్ష్యాలు లేవు - ఆయన మంచోడే

Update: 2018-12-07 11:24 GMT
బాలీవుడ్‌ లో మీటూ అంటూ ఎంతో మంది స్టార్స్‌ పై హీరోయిన్స్‌ మరియు పలువురు మహిళలు లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ మీటూ ఉద్యమంలో పాల్గొనే వారు ఎక్కువ శాతం ఫేక్‌ అని - వారు కేవలం పబ్లిసిటీ కోసం స్టార్స్‌ పై విమర్శలు చేస్తున్నారు అంటూ మొదటి నుండి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కొందరు తమపై ఎదుటి వారు చేస్తున్న లైంగిక వేదింపుల ఆరోపణలను సవాల్‌ చేస్తూ కోర్టుకు లేదా పోలీసుల వద్దకు వెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ తనపై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అంటూ పోలీసుల ద్వారా నిరూపించుకున్నాడు.

కొన్నాళ్ల క్రితం నటి కేట్‌ శర్మ ఈయనపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పెద్ద వయస్సు వ్యక్తి కదా అని ఆయన్ను కలిసేందుకు ఒంటరిగా వెళ్లిన సమయంలో తనను అత్యంత దారుణంగా లైంగికంగా వేదించాడు అంటూ ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేదించాడు అంటూ కేట్‌ పోలీసు కేసు కూడా పెట్టింది. కొన్ని రోజుల క్రితం తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని - ఈ సమయంలో తాను కేసు విషయమై తిరగలేను అంటూ కేసు ఉపసంహరించుకుంది. ఆ సమయంలోనే రాజీకి వచ్చారా అంటూ వార్తలు వచ్చాయి.

కేట్‌ కేసును ఉపసంహరణ చేసుకున్నా కూడా దర్శకుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిగిందట. ఆ విచారణలో దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ పై ఆమె చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని - బర్త్‌ డే సందర్బంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆధారాలుగా చూపించేందుకు కేట్‌ ప్రయత్నించింది. ఆ ఫొటోల్లో ఆయన లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా లేదని పోలీసులు అంటున్నారు. పబ్లిసిటీ కోసమే ఆమె దర్శకుడిపై ఆరోపణలు చేసిందని పోలీసులు తేల్చారు. తన పరువును తీసినందుకు గాను ఆమెపై న్యాయ పోరాటం చేస్తానంటూ సుభాష్‌ ఘాయ్‌ అన్నాడు.
Tags:    

Similar News