మీటూ : సెటిల్‌ మెంట్‌ అయ్యిందా లేదంటే..?

Update: 2018-11-24 16:57 GMT
బాలీవుడ్‌ లో ఎంతో మంది దర్శక నిర్మాతలపై మీటూ ఉద్యమంలో భాగంగా లైంగిక వేదింపుల ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు సుభాష్‌ ఘయ్‌ పై హీరోయిన్‌ కేట్‌ శర్మ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. కొన్ని వారాల క్రితం కేట్‌ శర్మ మీడియా ముందుకు వచ్చి తనను దర్శకుడు సుభాష్‌ ఘయ్‌ లైంగికంగా వేదించాడు. నా ప్రైవేట్‌ పార్ట్‌ లను టచ్‌ చేసేందుకు ప్రయత్నించడంతో పాటు ముద్దు పెట్టుకునేందుకు చూశాడని, ఆయన నన్ను బెదిరించాడని కూడా చెప్పింది. కేవలం ఆరోపణలతోనే ఆగకుండా ఏకంగా పోలీసుల ముందుకు కూడా వెళ్లింది.

ముంబయి, డీఎస్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేట్‌ శర్మ ఫిర్యాదు నమోదు చేసింది. సుభాష్‌ ఘయ్‌ తనను లైంగికంగా వేదించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కేసు ఎంక్వౌరీ జరుగుతున్న సమయంలోనే సుభాష్‌ ఘయ్‌ పై కేట్‌ తన ఫిర్యాదును వెనక్కు తీసుకుందట. ఫిర్యాదు వెనక్కు తీసుకున్న విషయం కాస్త ఆస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి ఆమెను మీడియా సంప్రదించగా వింత వింతగా సమాధానాలు చెబుతూ పలు అనుమానాలకు తెర లేపుతోంది.

తాను సుభాష్‌ ఘయ్‌ పై ఫిర్యాదు చేయడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. వారి బలవంతం వల్ల తాను కేసు ఉపసంహరించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరో సందర్బంగా మీటూ ఉద్యమంలో భాగంగా ఎవరిపై కూడా కేసులు నమోదు చేసి - ఎఫ్‌ ఐ ఆర్‌ ఫైల్‌ చేయలేదు. సుభాష్‌ ఘయ్‌ పై కూడా ఇప్పటి వరకు ఎఫ్‌ ఐ ఆర్‌ ఫైల్‌ కాలేదు. అందుకే తాను కేసు వెనక్కు తీసుకున్నాను అంది. ఆమె భిన్నమైన సమాధానాలు చెబుతున్న నేపథ్యంలో మద్యవర్తుల సమక్షంలో కేట్‌ శర్మ రాజీకి వచ్చిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News