బాలీవుడ్ అందాల కథానాయిక కత్రినా కైఫ్ ఓ ఇంటిది కాబోతోందన్నది హాట్ న్యూస్. తాను వలచిన సఖుడు.. ప్రతిభావంతుడు విక్కీ కౌశల్ తో వెడ్ లాక్ అవుతోందని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. రెండున్నరేళ్లుగా నిండా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా అనే రిసార్ట్ లో వివాహం చేసుకోనున్నట్లు కథనాలు వైరల్ అయ్యాయి.
డిసెంబర్ 9న ప్రేమపక్షులు ఒకటయ్యేందుకు ప్రతిజ్ఞకు సిద్ధమవుతున్నారని కత్రినా కైఫ్ సన్నిహితులు వెల్లడించారు. హిందూ వివాహ సాంప్రదాయంలో ఈ పెళ్లి జరగనుంది. ఇరువైపులా కుటుంబ సభ్యులు- సన్నిహితులు పెద్ద ఎత్తున పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 7- డిసెంబర్ 8 తేదీల్లో వరుసగా సంగీత్ - మెహందీ రాజస్థాన్ లో జరుగుతాయి.
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తో కలిసి అగ్నిసాక్షిగా ఏడడుగులు నడవబోయే తేదీ ఏదో ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చేసింది. 9వ తేదీ రాక ముందే మూడురోజుల పాటు వేడుకల కోసం కత్రినా- విక్కీ ఇరువైపులా బృందాలు విమాన టిక్కెట్లను బుక్ చేయడంలో బిజీగా ఉన్నాయి.
కొత్త జంటను ఆశీర్వదించడానికి వచ్చే అతిథులందరికీ వసతిని నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. ఈ భారీ బాలీవుడ్ వెడ్డింగ్ కు 200 మంది అతిధులు హాజరుకానున్నారు. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.
పెళ్లిలో బాలీవుడ్ స్టార్లు ఎవరెవరు కనిపిస్తారు? అన్నది తేలాల్సి ఉంది. అయితే అందమైన వధువు -వరుడు ఎలాంటి వస్త్రాలు ధరించబోతున్నారో వేచి చూడాలి. ఇప్పటికే సభ్యసాచి డిజైనర్ లుక్ లు రెడీ అయ్యాయని గుసగుస వినిపిస్తోంది.
వధూవరులుగా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ మెస్మరైజ్ చేస్తారని టాక్ ఉంది. నవ వధువు కత్రినా కైఫ్ కోసం పలువురు డిజైనర్లు దుస్తుల డిజైనింగ్స్ రూపొందించారు. అబు జానీ (మెహందీ).. మనీష్ మల్హోత్రా (సంగీతం) .. గూచీ (రిసెప్షన్) వస్త్రధారణలకు పక్కాగా ప్రిపేర్డ్ గా ఉన్నారట.