కత్రిన కైఫ్, రణబీర్ కపూర్ జంట గురించి రోజుకో పుకారు శికారు చేస్తోంది. బాలీవుడ్ లో మోస్ట్ అమేజింగ్ సెలబ్రిటీ లవర్స్‌గా పాపులరైందీ జంట. ఈ ఇద్దరి పెళ్లి గురించిన వార్తలు బాలీవుడ్ మీడియాలో పుంఖాలు పుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. కత్రిన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం రణబీర్ లండన్ వెళ్లాడని అక్కడ వెడ్డింగ్ రింగ్ తొడిగేశాడని ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అని ఠాంఠాం వేసింది మీడియా. కట్ చేస్తే అదేం లేదు. వెడ్డింగులు, నిశ్చితార్థాలు అసలే లేవు అంటూ అప్పట్లో కత్రిన చెప్పుకొచ్చింది.
మరోసారి అదే విషయాన్ని కుండ బద్ధలు కొడుతూ చెప్పుకొచ్చింది తాజా చిట్ చాట్ లో. ప్రస్తుతం ఈ భామ ఫాంటమ్ సినిమాలో కథానాయికగా నటించింది. ఫాంటమ్ త్వరలోనే రిలీజ్ కి రానుంది. ఈ సందర్భంగా సినిమా వివేషాలు చెబుతూనే వ్యక్తిగత విషయాల్ని ప్రస్థావించింది. నిశ్చితార్థం పూర్తయిందిట కదా! అన్న ప్రశ్నకు.. అలాంటిదేం లేదు. నిశ్చితార్థం నయ్, పెళ్లి కూడా నయ్. ఇప్పట్లో చేసుకునే ఆలోచనే లేదు అంటూ ఖరాకండిగా తెగేసి చెప్పింది.