కత్రినా కైఫ్... ఏజ్ పెరుగుతున్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అటు టాప్ హీరోలతోనే కాకుండా కుర్ర హీరోలతోనూ జత కడుతున్న ఈ బాలీవుడ్ భామ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? తన తాజా చిత్రం *జగ్గా జాసూస్* ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ కోసం చాలా రోజుల పాటు హాలీడేస్ కు దూరంగానే గడిపింది. ఇప్పుడు ఆ చిత్రం షూటింగ్ ముగియడం, చిత్రం కూడా రిలీజైపోవడంతో కత్రినాకు కాస్తంత రిలీఫ్ దొరికేసింది.
ఇంకేముంది.. ఎంచక్కా ఫ్లైటెక్కేసిన ఈ టాప్ హీరోయిన్ నేరుగా మొరాకోలో ల్యాండైపోయింది. మొరాకోలోని బీచుల్లో తెగ తిరిగేస్తున్న ఈ అమ్మడు అక్కడి సముద్ర అలలపై సర్ఫింగ్ చేస్తోందట. అయినా సినిమాల్లో అంత సుకుమారంగానే కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఫోర్స్ గా వచ్చే సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడం కూడా వచ్చా? అంటే... ఎందుకు రాదూ? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది.
ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయనుకుందో, ఏమో తెలియదు గానీ... మొరాకోలోని ఎస్సారియా బీచ్ లో తాను సర్ఫింగ్ చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓ సహాయకుడి పర్యవేక్షణలో కత్రినా సర్ఫింగ్ చేస్తున్న దృశ్యాలున్న ఈ వీడియో జనాన్ని బాగానే ఆకట్టుకుంటోంది. ఈ హాలీడే తర్వాత సల్మాన్ ఖాన్ తో కలిసి `ఏక్ థా టైగర్` సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న `టైగర్ జిందా హై` సినిమాలో కత్రినా నటించనుంది.
Full View