రియల్ లైఫ్ లో హీరోయిన్ డబుల్ యాక్షన్

Update: 2017-07-19 05:43 GMT
టెక్నాలజీ చేతిలోకి వచ్చాక.. జనాలకు విజువల్స్ చూపించే విధానమే మారిపోయింది. రకరకాల ఎఫెక్ట్స్ జోడించి.. వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు. అలాగని జాగ్రత్తగా ఉండకపోతే ఎలా ఉంటుందో.. ఇప్పుడు ఐఫా అవార్డుల సందర్భంగా స్పష్టంగా తెలుస్తోంది.

రణబీర్ - కత్రినాలు నటించిన జగ్గా జాసూస్ లో 'యేహీ ఉమర్ హై.. కర్ లే గల్తీ సే మిస్టేక్' అనే పాట రీసెంట్ గా రిలీజ్ అయింది. ఐఫా అవార్డుల నిర్వాహకులు.. ఈ మిస్టేక్ చేయమన్న పాయింట్ ను సీరియస్ గా తీసుకున్నట్లుగా ఉన్నారు. అందుకే సీరియస్ గానే పెద్ద మిస్టేక్ చేసేశారు. ఐఫా అవార్డుల సందర్భంగా ఒకేసారి రెండు ప్రదేశాల్లో కనిపించి ఆశ్చర్యపరిచింది కత్రినా కైఫ్. అఫ్ కోర్స్.. అది ఎడిటింగ్ మిస్టేక్ అయినా.. జనాలు మాత్రం కత్రినా డ్యుయల్ రోల్ అంటూ ట్రాలింగ్ చేసి పారేస్తున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డును అందించేందుకు.. కత్రినా కైఫ్ స్టేజ్ పైన ఉంది. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందో చెబుతున్నపుడు.. కేట్ మరో ప్లేస్ లో కూడా దర్శనం ఇచ్చింది.

అక్కడ స్టేజ్ పై ఉన్నట్లు చూపుతూనే.. ఆ మరుసటి ఫ్రేమ్ లో షాహిద్ కపూర్ పక్కన కూర్చుని నవ్వుతున్నట్లుగా కట్ చేశారు. జనాలకు ఈ సీక్వెన్స్ తెగ నవ్వులు తెప్పించేసింది. తన లైఫ్ లో కత్రినా కైఫ్ కు ఇది గుర్తుంచుకోదగ్గ రియల్ లైఫ్ డ్యుయల్ రోల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News