కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు కత్రీనా కైఫ్ ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. వారిద్దరి తీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో అన్నట్లుగా వ్యవహరించారు. అయితే బయటకు మాత్రం నోరు ఎత్తి చెప్పలేదు. ప్రేమ వ్యవహారం కొనసాగుతుందని భావిస్తున్న సమయంలోనే కత్రీనా మరో హీరో అయిన రణ్ బీర్ కపూర్ తో అఫైర్ పెట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇద్దరి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. బ్రేకప్ తర్వాత సల్మాన్.. కత్రీనాలు కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్ల విరామం తర్వాత 'భారత్' అనే చిత్రంలో కలిసి నటించారు.
'భారత్' చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ మరియు కత్రీనా తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ అవ్వడంతో పాటు... పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కత్రీనాను విలేకరి ప్రశ్నిస్తూ.. చాలా కాలం తర్వాత భాయీజాన్ తో సినిమా చేశారు కదా ఎలా అనిపించింది అని అడిగాడు.
విలేకరి ప్రశ్నకు కత్రీనా కంటే సల్మాన్ ముందు స్పందించాడు. సల్మాన్ మాట్లాడుతూ.. నేను కత్రీనాకు భాయీజాన్ కాదని.. నన్ను ఆమె ఎప్పుడు అలా పిలవలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కత్రీనా మాట్లాడుతూ.. ఔను నిజమే నేను సల్మాన్ ను ఎప్పుడు కూడా భాయీజాన్ అని పిలవలేదు. సల్మాన్ నాకు అన్న కాదు. కేవలం స్నేహితుడు మాత్రమే. ఆయన ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటూ అందరిపై పంచ్ లు వేస్తూ ఉంటాడు. నేనేం ఊరుకే ఉండను. నేను కూడా సల్మాన్ పై అప్పుడప్పుడు పంచ్ లు వేస్తూనే ఉండేదాన్ని. మరోసారి కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా తప్పకుండా అంటూ ఇద్దరు సమాధానం ఇచ్చారు. గతంలో బ్రేకప్ అయిన వీరిద్దరు మళ్లీ ఒక్కటయ్యారని.. ప్రస్తుతం వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారనే పుకార్లు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.