జుట్టుకు 55 లక్షలా? జోకులొద్దమ్మా

Update: 2016-01-29 15:30 GMT
ఈ మధ్యన కొన్ని గాసిప్స్‌ వింటుంటే.. మైండ్‌ బ్లోయింగ్‌ గా ఉందంటోంది కత్రినా కైఫ్‌. అసలు ఇలాంటి రూమర్లన్నీ ఎక్కడ పుడుతున్నాయో కూడా తెలియదు అంటూ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. అమ్మడి బ్రేకప్‌ గురించి కాకుండా.. మనకు విపరీతంగా కిక్కిచ్చినా న్యూస్‌ ఏంటంటే.. ''ఫితూర్‌'' సినిమాలో ఈమె హెయిర్‌ స్టయిలింగ్‌ కోసం ఏకంగా 55 లక్షలు ఖర్చు పెట్టారనే విషయం.

అంతే కాదు.. ఈ సినిమాలో అమ్మడు రెడ్‌ కలర్‌ లో ఉన్న జుట్టును విరబూయించడానికి చాలా కష్టపడిందని.. ఆ హెయిర్‌ను ఒక జాలువారుతున్న జలపాతంలో ఆరబోయడానికి చాలా శ్రమించిందని చెప్పారు. ఇందులో అసలు నిజముందా?  అబ్బే అంత సీన్‌ లేదు అనేసింది కత్రినా కైఫ్‌ ''అసలు ఎవరు చెప్తారండీ మీకు ఇలాంటి రూమర్లన్నీ (పెద్దగా నవ్వుతూ).. నా హెయిర్‌ స్టయిలింగ్ డిపార్టుమెంట్‌ అంతా చాలా కష్టపడి అలాంటి లుక్‌ క్రియేట్‌ చేసిందంతే. 55 లక్షలా ఇంకేమన్నానా!! మా నిర్మాతలు మరీ అంత లిబరల్‌ కాదు బాబోయ్‌'' అంటూ చెప్పుకొచ్చింది కత్రినా.

మరీ జుట్టు కోసం 55 లక్షలు ఖర్చుపెట్టడానికి దేమన్నా షారూఖ్‌ ఖాన్‌ తీస్తున్న గ్రాఫిక్స్ సినిమానా లేకపోతే రజనీకాంత్‌ రోబో 2.0 నా.. అంత బడ్జెట్‌ కేశాలకు పెట్టలాంటే కష్టమే సుమీ.
Tags:    

Similar News