శంకర్ ని నమ్మని నిర్మాతలు..?

సౌత్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకప్పుడు టాప్ 1 లో ఉన్న శంకర్ ఇప్పుడు సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు.

Update: 2024-09-07 15:36 GMT

సౌత్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకప్పుడు టాప్ 1 లో ఉన్న శంకర్ ఇప్పుడు సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడో పది పదిహేనేళ్ల క్రితమే తన కంటెంట్ తో పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాలు అందుకున్న శంకర్ ఈమధ్య వరుస ఫ్లాపులతో ఫాం కోల్పోయారు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఇండియన్ 2 సినిమా కూడా నిరాశ పరచడంతో శంకర్ సినిమా అంటే బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది. ఐతే ప్రస్తుతం శంకర్ చరణ్ హీరోగా గేం చేంజర్ సినిమా చేస్తున్నారు.

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్నాళ్లుగా సెట్స్ మీద ఉంది. సినిమా రిలీజ్ ఎప్పుడంటూ మెగా ఫ్యాన్స్ ఎంత ఎటాక్ చేస్తున్న చిత్ర యూనిట్ మాత్రం అసలేమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడెప్పుడో జరగండి సాంగ్ ఒకటి వదిలారు ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఐతే ఓ పక్క నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ క్రిస్మస్ రేసులో ఉంటుందని అంటున్నా కూడా సినిమాను కచ్చితంగా ఆ డేట్ కి పూర్తి చేస్తారా అన్న డౌట్ ఉంది.

అందుకే నేడు వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సెకండ్ సింగిల్ సెప్టెంబర్ లో ఉంటుందని అనౌన్స్ చేశారు. ఐతే ఎలాగు క్రిస్మస్ కి రిలీజ్ అనుకుంటున్నారు కదా అని డేట్ వేస్తారేమో అనుకుంటే అది మాత్రం రివీల్ చేయలేదు. అంటే శంకర్ సినిమాను డిసెంబర్ కల్లా కూడా పూర్తి చేస్తాడో లేదో అన్న అపనమ్మకం నిర్మాతలకు ఉందని తెలుస్తుంది. ఓ పక్క మెగా ఫ్యాన్స్ మాత్రం శంకర్ అండ్ గేం చేంజర్ టీం మీద చాలా ఫైర్ అవుతున్నారు.

గేం చేంజర్ సినిమా లో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ గేమ్ చేంజర్ తో మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ లెక్కలు మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న సినిమా లేట్ అవుతున్నందుకు మాత్రం చాలా అప్సెట్ అవుతున్నారు.

Tags:    

Similar News