దీపికకు పురిటి నొప్పులు.. రిలయన్స్ ఆస్పత్రికి..!
స్టార్ కపుల్ దీపిక పదుకొణె, రణవీర్ సింగ్ త్వరలో స్టార్ పేరెంట్స్ కాబోతున్నారు.
స్టార్ కపుల్ దీపిక పదుకొణె, రణవీర్ సింగ్ త్వరలో స్టార్ పేరెంట్స్ కాబోతున్నారు. దీపిక తన మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి ముందు శనివారం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చేరింది. కుటుంబ సమేతంగా సౌత్ ముంబై ఆసుపత్రికి చేరుకోగానే ప్రజలు వారిని గుర్తించారు.
తాజాగా రివీలైన ఫోటోలు, వీడియోలలో దీపికా- రణవీర్ దంపతుల కారు ఆసుపత్రికి చేరుకోవడం కనిపించింది. గ్లాస్ లేతరంగు కిటికీల నుంచి చూడగా జంట కనిపించింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. దీపిక ఆస్పత్రిలో చేరారని ధృవీకరించారు. శిశువు జననం ఎప్పుడైనా ఆశించవచ్చు. దీపిక-రణవీర్ వారి కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. వారి చిన్ని ఆనందపు క్షణం కోసం కుటుంబాలంతా ఎదురు చూస్తున్నారు. శుభవార్త దగ్గరలోనే ఉంది! అని స్టిల్ ఫోటోగ్రాఫర్ ఒకరు వ్యాఖ్యానించారు.
సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ బంగ్లా `మన్నత్` పక్కనే ఉన్న బాంద్రాలోని తమ అపార్ట్‌మెంట్‌లోకి దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ మారుతున్నట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం... భవనం పూర్తయిన తర్వాత ఈ జంట కొత్త నివాసంలోకి మారతారు. భారీ భవంతిలోని 16 నుండి 19 అంతస్తుల వరకూ వారి స్వాధీనంలోకి వస్తుంది. ప్రైవేట్ టెర్రస్ కూడా ఉంటుందని తెలుస్తోంది.