RRRతో కీరవాణి హవా.. మరో రెండు ప్రఖ్యాత అవార్డులు

Update: 2022-12-12 09:40 GMT
దర్శకదీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వచ్చిన RRR సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ బిగ్ మల్టీస్టారర్ మూవీ ఎంతమంది అభిమానులను ఆకట్టుకుంది. అయితే వివిధ దేశాలలో కూడా ఈ సినిమాను చూసిన సినీ లవర్స్ చాలా పాజిటివ్ గా స్పందించారు.

ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సినిమా మేకింగ్ విధానం పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఆస్కార్ అవార్డు కూడా RRR సినిమాకు రావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని అవార్డులు అందించే సంస్థలు ప్రత్యేకంగా RRR సినిమాకు పురస్కారాలను అందిస్తున్నాయి.

ఇటీవల మ్యూజిక్ డిపార్ట్మెంట్లో కూడా MM కీరవాణికి ప్రత్యేకంగా పురస్కారాలు రావడం వైరల్ గా మారింది. ఇటీవల లాస్ ఎంజీల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి  మ్యూజిక్ స్కోర్ కేటగిరీలో కీరవాణి కి అవార్డు వచ్చింది. అలాగే ఇప్పుడు మరో అవార్డును గెలుచుకున్నారు. ఈసారి బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌లో ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌ విభాగంలో RRR అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఉత్తమ ఒరిజినల్ స్కోర్లో RRR M. M. కీరవాణి విన్నర్ అని ప్రకటించారు.

మొత్తానికి గ్యాప్ లేకుండా RRR సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవార్డులు అయితే దక్కుతున్నాయి. ఇక ఆస్కార్ భరిలో కూడా ఈ సినిమాను నిలిపితే తప్పకుండా అవార్డులను సొంతం చేసుకుంటుంది అని పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరోవైపు జపాన్లో కూడా RRR సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో రజినీకాంత్ ముత్తు సినిమా ద్వారా జపాన్లో క్రియేట్ చేసిన రికార్డును ఇటీవల ఈ సినిమా బ్రేక్ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News