బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ హీరోలుగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల వారసులు రావడం చాలా కామన్ అయిపోయింది. ఎంతమంది వీరిలో సక్సెస్ అవుతున్నారు.. లాంగ్ టర్మ్ హీరోలుగా కొనసాగుతున్నారు అనేది పక్కనబెడితే కొత్త హీరోల రాక మాత్రం అసలు ఆగడం లేదు. మెగా ఫ్యామిలీనుండి కొత్త హీరోగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫైలిం ఆల్రెడీ సెట్స్ పై ఉంది. మెగా ఫ్యామిలీ నుండే కాదు. రాజమౌళి ఫ్యామిలీ నుండి కూడా కొత్త హీరో రానున్నాడు.
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి ఇద్దరు తనయులు. పెద్దబ్బాయి కాల భైరవ ఇప్పటికే సింగర్ గా పేరుతెచ్చుకున్నాడు. త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా చాటే ప్రయత్నాలలో ఉన్నాడట. ఇదిలా ఉంటే కీరవాణి చిన్న కుమారుడు సింహా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు సింహా డెబ్యూ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ మూవీతో నిశాంత్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.
సింహా గతంలో 'రంగస్థలం' చిత్రానికి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. మరి డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో అనుభవం సాధించి ఇలా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కాస్త వెరైటీగానే ఉంది కానీ కుర్రాడు మాత్రం లాంగ్ హెయిర్ తో చాకులానే ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ను ఎలేక్షన్స్ గోల సద్దుమణిగిన తర్వాత రిలీజ్ చేస్తారట. మరి సన్నాఫ్ కీరవాణి లక్కు ఎలా ఉందో తెలియాలంటే మనం ఈ ఏడాది చివరివరకూ వేచి చూడాల్సిందే.