ఆ విషయం ముందుగా మీకే చెబుతా: కీర్తిసురేష్

Update: 2021-05-22 01:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది కన్నడ బ్యూటీ కీర్తిసురేష్. ఈ భామ అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలు ఖాతాలో వేసుకొని తెలుగు రాష్ట్రాల కుర్రకారును బుట్టలో వేసుకుంది. ఇప్పటివరకు డీసెంట్ క్యారెక్టర్స్ తో సినిమాల్లో గాని ఫోటోషూట్స్ లో గాని ఎలాంటి స్కిన్ షో - గ్లామర్ రోల్స్ చేయకుండానే కీర్తి వరుస చేతినిండా అవకాశాలు సొంతం చేసుకుంటుంది. అయితే తాజాగా హీరో నితిన్ సరసన పవర్ పేట, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట'.. సినిమాలతో పాటు 'మిస్ ఇండియా' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.

ఇక ఈ విషయాలు పక్కన పెడితే కీర్తి మొదటి నుండి కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన లవ్ మేటర్ గురించి అడిగితే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.  అయితే ఆ ఇంటర్వ్యూలో కీర్తికి స్కూల్ నుండి కాలేజీ వరకు అసలు లవ్ ప్రపోజల్స్ రాలేదని చెప్పింది. అలా చెప్పేసరికి ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ఎందుకంటే ఇంత అందగత్తెను ఎవరు లవ్ చేయలేదంటే చాలా వెనకబడి పోయింటారు అని అనుకున్నారు. అమ్మడు చదివింది ఉమెన్స్ కాలేజీలో కాబట్టి పెద్దగా ప్రపోసల్స్ వచ్చే అవకాశం లేదు. కానీ హీరోయిన్ అయిన తర్వాత మాత్రం కుప్పలుగా లవ్ లెటర్స్ ప్రొపోజల్స్ వస్తున్నాయని చెప్పింది. అందులో ఓ వీరాభిమాని గురించి కూడా స్పెషల్ గా మెన్షన్ చేసి చెప్పింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అన్నాక పుకార్లు రావడం మాములే.

కానీ ఆ పుకార్లు లిమిట్ అయితే ఏంకాదు. అవే లిమిట్ దాటిపోతే ఖచ్చితంగా సెలబ్రిటీలే రంగంలోకి దిగి సమాధానం చెబుతారు. తాజాగా కీర్తికి అలాంటి సందర్బం ఎదురైందట. ఆ మధ్యలో కీర్తి ఎవరో వ్యాపారవేత్తను మ్యారేజ్ చేసుకోనుందని పుకార్లు వచ్చాయి. ఫస్ట్ లైట్ తీసుకున్నప్పటికి ఇంకా స్ప్రెడ్ అవ్వడంతో వెంటనే.. ఇప్పట్లో లవ్ - మ్యారేజ్ లాంటి వాటి పై ఇంటరెస్ట్ లేదని అలాంటిది ఏదైనా ఉంటే ముందుగా సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని చెప్పుకొచ్చింది. ఈ సమాధానంతో రూమర్స్ కి చెక్ పడ్డట్లే అయింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కీర్తి మహేష్ బాబుతో సర్కారు పాటతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాతే సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.
Tags:    

Similar News