కీర్తి సురేష్.. తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మలయాళంలో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన `మహానటి` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఎన్నో అద్భుత పాత్రలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది.
ఇందులో సావిత్రిగా కీర్తి సురేష్ నటించడం కాదు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవించేసింది. తెర మీద సావిత్రినే చూస్తున్నామ అన్నంతగా మెప్పించి జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. అయితే ఈ భారీ హిట్ మూవీ అనంతరం కీర్తి సురేష్ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. లేడీ ఓరియెంటెడ్ మరియు స్టార్ హీరోల చిత్రాల నుండీ ఆఫర్లు వచ్చాయి. కానీ, కీర్తి సురేష్ నటించిన సినిమాలన్నీ వరసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ఇక తన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోతున్న తరుణంలో కీర్తి సురేష్ `సర్కారు వారి పాట`తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అలాగే మరోవైపు కీర్తి సురేష్ నటించిన `సాని కాయిధం(తెలుగులో చిన్ని)`అనే తమిళ చిత్రం మే 6న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల అయింది. ఈ మూవీకి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. `సాని కాయిధం` ఓటీటీలో స్ట్రీమింగ్ అయి ప్రపంచ స్థాయిలో రీచ్ అవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. కానీ, థియేటర్లలో విడుదలైతే ఇంకా బాగుండేదంటూ చెప్పుకొచ్చింది. తనకు తమిళం, తెలుగు, మలయాళం అనే భాషా పరమైన బేధాలు లేవని, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నటిస్తానని ఆమె పేర్కొంది.
అలాగే అన్ని భాషల్లోనూ ఒకే పారితోషికం తీసుకుంటున్నానని, కొన్ని సమయాల్లో తగ్గించుకుని కూడా తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఈ క్రమంలోనే `ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు?` అన్న ప్రశ్న కీర్తి సురేష్ కు ఎదురైంది. అందుకు ఆమె బదులిస్తూ.. `విజయ్‌సేతుపతి నటన చాలా ఇష్టం. ఆయనతో ఒక్కసారైనా నటించాలనుంది. అలాగే జయం రవి, కార్తీ ఇలా చాలా మంది నటులతో నటించాలి. అదే విధంగా మణిరత్నం, రాజమౌళి, శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉంది` అంటూ తెలిపింది.
మొత్తానికి కీర్తి సురేష్ హీరోల లిస్ట్ పెద్దదే అయినప్పటికీ.. ముఖ్యంగా మాత్రం ఈమె విజయ్ సేతుపతితో నటించాలని తెగ ముచ్చట పడుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. మరి ఈమెకు విజయ్ సేతుపతి ఛాన్స్ ఇస్తాడో..లేదో..చూడాలి. కాగా, కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నానికి జోడీగా `దసరా`, మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` చిత్రాలు చేస్తోంది. తమిళ్, మలయాళంలో పలు ప్రాజెక్ట్స్ ను టేకప్ చేసింది.