'నేను శైలజ' .. 'నేను లోకల్' తరువాత కీర్తి సురేశ్ తెలుగులో గ్లామరస్ పాత్రలను పోషించలేదు. వరుసగా ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలను చేస్తూ వెళ్లింది. అయితే అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో అందంగా ఆడిపాడే పాత్రలో ఆమెను చూడటానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. వాళ్ల ముచ్చట తీర్చడానికి అన్నట్టుగా ఆమె 'సర్కారువారి పాట'లో ఆ తరహా పాత్రనే పోషించింది. 'కళావతి'గా ఈ సినిమాలో ఆమె అందాల సందడి చేసింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేశ్ మాట్లాడింది.
'ముందుగా 'కళావతి'ని నాకు బహుమతిగా ఇచ్చిన పరశురామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ పాత్రలో నన్ను ఊహించుకుని రాసినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కాకపోతే షూటింగులో అప్పుడప్పుడు నా పేరు మరిచిపోయి రష్మిక .. రష్మిక అంటున్నారు. రష్మికతో నెక్స్ట్ మూవీ చేసేటప్పుడు ఆమెను 'కీర్తి అని పిలుస్తారా అనేది చూడాలి. మీతో కలిసి పనిచేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. 'కళావతి' పాత్రను మదిలో నిలిచేలా చూపించినందుకు డీఓపీ మధి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తమన్ తో కలిసి నేను పనిచేసిన సెకండ్ ఫిల్మ్ ఇది. 'భం అఖండ' అనే మాస్ నంబర్ నుంచి 'కళావతి' అనే క్లాసికల్ నంబర్ వరకూ చేస్తున్నారు .. స్టేజ్ పై లైవ్ షోస్ కూడా ఇస్తున్నారు. అందుకు నేను ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఇక ఇప్పుడు 'మ మ మహేశ్' గారిని గురించి మాట్లాడతాను. మహేశ్ గారితో షూటింగులో పాల్గొనేటప్పుడు ఆయన టైమ్ మ్యాచ్ చేయడం చాలా కష్టమైపోయేది. తన కలర్ కి నేను మ్యాచ్ అవుతానా అనే టెన్షన్. ఇక ఇప్పుడు మీరు నన్ను మాట్లాడనిస్తారా లేదా అనేది టెన్షన్.
మహేశ్ గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అలాంటి ఒక అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం మీరంతా ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారనేది నాకు తెలుసు. ఆయన ఉన్నారు .. ఆయన విన్నారు .. ఈ నెల 12న ఆయన థియేటర్ కి వస్తున్నారు. ఆయన రియల్ కైఫ్ కళావతి నమ్రత గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. మీరు ఇచ్చిన సపోర్టుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.