కీర్తి సురేశ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి మంచి మార్కెట్ ఉంది. 'మహానటి' తరువాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు ఆ స్థాయికి దగ్గరగా కూడా వెళ్లలేకపోయాయి. చివరిగా తెలుగులో ఆమె చేసిన 'రంగ్ దే' కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం ఆమె చేసిన 'గుడ్ లక్ సఖి' ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
చరణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేదికపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. 'మహానటి' తరువాత నేను సైన్ చేసిన సినిమా ఇది. ఒక సీరియస్ సినిమా చేసిన తరువాత ఒక ఫన్ సినిమా చేయాలనిపించింది. అలాంటి సమయంలోనే ఈ కథ నా దగ్గరికి వచ్చింది. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు సుధీర్ గారికీ .. నాగేశ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. కథ వినగానే ఎంతమాత్రం ఆలోచించకుండా నేను ఓకే చెప్పేశాను .. అంతగా నచ్చింది నాకు. చిరంతన్ దాస్ గారు స్క్రీన్ పై నన్ను చాలా అందంగా చూపించారు .. అందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిగతా హీరోలకంటే నేను జగపతిబాబుగారితోనే ఎక్కువ సినిమాలు చేశాను. సెట్లో ఆయన చాలా సరదాగా ఉంటారు. ఇండస్ట్రీలో ఆయన నాకు ఒక మంచి ఫ్రెండ్. ఈ సినిమాలో నా హ్యాండ్సమ్ కోచ్ కూడా. ఆది పినిశెట్టి విషయానికి వస్తే ఈ సినిమాలో ఆయన 'గోలి రాజు'గా కనిపిస్తాడు. ఆయన ఒక స్వీటెస్ట్ కో యాక్టర్. ఆయన ఈ సినిమాలో ఒక మంచి పార్ట్ ను ప్లే చేశారు. చారంను ఉద్దేశించి "మీరు గెస్టుగా రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక్క 'R' తో రంగస్థలన్ని ఒక ఊపు ఊపారు. మరి 'RRR'ను ఎప్పుడు చూపిస్తున్నారు? ఆ సినిమా కోసం వెయిటింగ్. తరువాత 'నాటు నాటు' స్టెప్ నాతో చేయాలి .. అది నా డ్రీమ్.
ఈ షోకి చిరంజీవి గారు రావాలిసింది .. కానీ ఆయన రాలేకపోయారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను. ఇక బ్యానర్ పేరు చెప్పడానికి ట్రై చేసిన కీర్తి నిర్మాత సుధీర్ ను ఉద్దేశించి "సుధీర్ ఆ పేరేంటి నీలాగే లాంగ్ గా ఉంది. సుధీర్ ను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. నాకు డబ్బులు ఇచ్చారు గనుక వాళ్లు మరిచిపోవచ్చు .. కానీ నేను డబ్బు తీసుకున్నాను గనుక మరిచిపోకూడదు. దేవిశ్రీతో నా ఫస్టు ఫిల్మ్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. నాకు తెలుసు ఇది ఫిఫ్త్ ఫిల్మ్ అనుకుంటాను. ఈ సినిమా 28వ తేదీన థియటర్స్ కి వస్తోంది .. తప్పకుండా చూడండి" అన్నారు. ఆ తరువాత చివరిలో చరణ్ తో 'నాటు నాటు' స్టెప్పేసి తన ముచ్చట తీర్చుకుంది.
Full View