కీర్తి సురేష్ తో పోలిస్తే సమంత పెద్ద హీరోయిన్. అయినప్పటికీ కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహానటి’లో స్పెషల్ క్యారెక్టర్ చేసింది సామ్. ఆ ఇద్దరూ సినిమాకు పెద్ద బలమయ్యారు. తమ పాత్రల్ని చాలా బాగా పండించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. విశేషం ఏంటంటే ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు. అందులో వాళ్లు క్యారెక్టర్లు మార్చుకుంటుండటం విశేషం. ఆ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుంటే కీర్తి సురేష్ క్యామియో రోల్ చేయబోతోంది. ఆ సినిమా పేరు.. సీమ రాజా. శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సమంత అతడికి తొలిసారి జోడీగా నటిస్తోంది. ఇందులో సామ్ పల్లెటూరి అమ్మాయిగా లంగా వోణీల్లో కనిపించబోతుండటం విశేషం. ఆమె లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.
శివ కార్తికేయన్ తో ఇప్పటికే ‘రజనీ మురుగన్’ లాంటి బ్లాక్ బస్టర్లో.. ‘రెమో’ లాంటి హిట్ మూవీలో నటించింది కీర్తి. వీళ్లిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది కోలీవుడ్లో. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారు. పొన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన శివ కార్తికేయన్.. ‘ఎదిర్ నీచిల్’ సినిమాతో హీరోగా పరిచయమై మంచి విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్లతో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు. అతను చివరగా నటించిన ‘వేలైక్కారన్’ కూడా సూపర్ హిట్టయింది. ప్రస్తుతం అతను మూణ్నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను కూడా మొదలుపెట్టి ఓ సినిమా అనౌన్స్ చేశాడు.