భోళా శంక‌ర్ అన్న‌య్య‌కు రాఖీ క‌ట్టిన మ‌హాన‌టి!

Update: 2021-08-22 07:49 GMT
చెల్లెల్లంద‌రి ర‌క్షాబంధం.. అభిమానులంద‌రి ఆత్మ‌బంధం.. మ‌నంద‌రి అన్న‌య్య జ‌న్మ‌దినం .. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్యా!!  .. కీర్తి సురేష్ అంద‌మైన స్వ‌రం చెల్లెమ్మ‌ల‌కు ప్ర‌తీక‌గా నిలుస్తుంటే భోళా శంక‌ర్ (చిరంజీవి) అన్న‌య్యతో పాటు అంద‌రు అన్న‌య్య‌ల‌ త‌నువు పుల‌కించేలా నేటి ర‌క్షా బంధ‌న్ ప్రాశ‌స్త్యం కొన్ని సెక‌న్ల వీడియోలో రివీలైంది.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌న్ నాడే మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే కాబట్టి చెల్లెమ్మ‌లంద‌రి గుండెల్ని తాకేలా అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్ తో భోళాశంక‌ర్ టీమ్ మెస్మ‌రైజ్ చేసింది. ఎట్ట‌కేల‌కు వేదాళం రీమేక్ `భోళా శంక‌ర్‌`లో చిరంజీవి సోద‌రిగా కీర్తి సురేష్ ఫైన‌ల్ అయ్యింద‌ని అధికారికంగా ప్ర‌క‌టించార‌న్న‌మాట‌.

చెల్లెమ్మ కీర్తి అన్న‌య్య  చిరంజీవి చేతికి రాఖీ క‌డుతూ చిరున‌వ్వులు చిందిస్తుంటే ఎంతో ఆప్యాయంగా ఆనందంగా చిరు ఆ చెల్లెమ్మ‌ను ప్రేమ‌గా ధీవించిన తీరు ఎంతో ముచ్చ‌ట‌గొలుపుతోంది. మోష‌న్ పోస్ట‌ర్ రాఖీ మెగా స్పెష‌ల్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫోటోగ్రాఫ్ తో పాటు #రాఖీ విత్ భోళా శంక‌ర్ ట్యాగ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.  మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై అనీల్ సుంక‌ర‌- రామ‌బ్ర‌హ్మం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంత‌కుముందే టైటిల్ ని మ‌హేష్ లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ కి మ‌హేష్ ప్ర‌త్యేకంగా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తియేటా త‌న సోద‌రీమ‌ణుల‌తో రాఖీ పండుగ‌ను జ‌రుపుకోవ‌డాన్ని మెగాస్టార్ అస్స‌లు మిస్ చేయ‌రు. నేడు (22ఆగ‌స్టు 2021) రాఖీ పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని మెగాస్టార్ కి రియ‌ల్ లైఫ్ అక్కా చెల్లెళ్లు కూడా రాఖీలు క‌ట్టి అన్న‌య్య ధీవెన‌లు అందుకున్నార‌ని తెలుస్తోంది.


Full View
Tags:    

Similar News