డోంట్ రష్ ఛాలెంజ్.. ఆ రేంజులో కీర్తి డ్యాన్సులు..!

Update: 2021-03-21 07:11 GMT
మ‌హాన‌టిగా కీర్తి సురేష్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు మ‌న్న‌న‌లు అందుకుంది. న‌టిగా త‌న‌ని తాను కెరీర్ ఆరంభ‌మే నిరూపించుకున్న ఈ న‌ట‌వార‌సురాలికి డ్యాన్సుల ప‌రంగా త‌న పూర్తి స్థాయిని ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌నే చెప్పాలి. అజ్ఞాత‌వాసి- పందెంకోడి 2 స‌హా ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో నటించినా వాటి వ‌ల్ల కీర్తికి ఏమాత్రం ఒరిగిందేమీ లేదు.

అందుకే మునుముందు త‌న డ్యాన్సింగ్ ట్యాలెంట్ ని చూపించేందుకు కీర్తి ప్రిప‌రేష‌న్స్ లో ఉంద‌ని తెలిసింది. ఈ భామ ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తోంది. అలాగే యూత్ ఎన‌ర్జిటిక్ డ్యాన్సింగ్ స్టార్ నితిన్ స‌ర‌స‌న రంగ్ దేలో న‌టించింది.  ఈ సినిమాల్లో కొన్ని మాస్ సాంగ్స్ లో డ్యాన్సుల ప‌రంగా స‌త్తా చాటేందుకు బాగానే శ్ర‌మించింద‌ట‌.

మ‌రోవైపు కీర్తి ఓ డ్యాన్స్ స్టూడియోలో త‌న కొలీగ్ ప‌వ‌న్ అలెక్స్ తో క‌లిసి  స్టెప్పులు అద‌ర‌గొట్టిన ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతోంది. కీర్తి సురేష్ త‌న‌ సోషల్ మీడియాలో `డోన్ట్ రష్ ఛాలెంజ్` పేరుతో ఈ డ్యాన్సింగ్ వీడియోని షేర్ చేయ‌గా క్ష‌ణాల్లో ల‌క్ష‌లాది వీక్ష‌ణ‌లతో దూసుకెళుతోంది.

స్టెప‌ప్‌- ఏబీసీడీ లాంటి డ్యాన్స్ బేస్డ్ చిత్రంలో అవ‌కాశం వ‌స్తే కీర్తి న‌టిస్తుందా?  అంటే ఛాలెంజింగ్  డ్యాన్స‌ర్ గా నిరూపించే స‌త్తా త‌న‌కు ఉంద‌ని నిరూపిస్తోంది. ఇక కీర్తి స్వ‌త‌హాగానే క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ కావ‌డంతో మాస్ నంబ‌ర్స్ ని ఈజీగా క్యాచ్ చేయ‌గ‌ల‌దు. కొరియోగ్రాఫ‌ర్ల‌కు ధీటుగానూ ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌దు.



Tags:    

Similar News