సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోన్న అందాల భామ కీర్తి సురేష్. ఈ బ్యూటీ తాజాగా దసరా సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలు పెట్టుకొని ఫుల్ బిజీగా ఉంది. అందులో జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ సెరిన్ ఒకటి.
అలాగే తెలుగులో మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. వీటితో పాటు రెండు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది.వీటిలో ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. కీర్తి సురేష్ తండ్రి మలయాళంలో పెద్ద ప్రొడ్యూసర్ కాగా తల్లి మేనక ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెలుగులో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడు వీరి ఫ్యామిలీ నుంచి కీర్తి సురేష్ అక్క రేవతి సురేష్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అయితే ఆమె దర్శకురాలిగా తన ప్రయాణం స్టార్ట్ చేయడం విశేషం. మలయాళంలో థాంక్యూ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా పోస్టర్ ని లాంచ్ చేసి షేర్ చేసింది. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.
సురేష్ కుమార్, నితిన్ మోహన్ ఈ షార్ట్ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేశారు. పోస్టర్ లో రెండు జతల చెప్పులని పెట్టారు. అలాగే థాంక్యూ టైటిల్ లో టీ కప్ సింబల్ ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. దీనిని బట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథగా ఇది ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా కీర్తి సురేష్ అక్క రేవతి సురేష్ దర్శకురాలిగా బిగ్ స్క్రీన్ పైకి అడుగులు వేస్తుందా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే కెరియర్ లో ఓ వైపు గ్లామర్ రోల్స్, మరో వైపు యునిక్ గా గుర్తుండిపోయే వెన్నెల లాంటి క్యారెక్టర్ చేస్తూ కీర్తి సురేష్ నటిగా దూసుకుపోతోంది. మహానటి తర్వాత తెలుగులో మరోసారి అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ వెన్నెల పాత్ర ద్వారా కీర్తి సురేష్ ఇచ్చిందనే కితాబు అందుకుంది. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో చిరంజీవి చెల్లిగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తూ ఉండటం విశేషం.