నేను శైలజ నేను లోకల్ సినిమాలతో క్యూట్ అండ్ హోమ్లీ హీరోయిన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇమేజ్ మహానటితో అమాంతం మారిపోయింది. సావిత్రి పాత్రలో తను పరకాయ ప్రవేశం చేసిన తీరుకి యూత్ మొదలుకుని పండుముసలి వరకు అందరు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. సావిత్రి అన్నా మహానటి అని వినిపించినా వెంటనే కీర్తి సురేష్ గుర్తుకువచ్చేలా ప్రభావితం చేసింది ఆ మూవీ. దాని తర్వాత కీర్తి మూవీస్ ఏవి విడుదల కాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ముందుకు రాబోతున్నాయి. అందులో మొదటిది సామీ స్క్వేర్. చియాన్ విక్రమ్ హీరోగా కేకలు అరుపులతో ఊర మాస్ పోలీస్ సినిమాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన హరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేషే. ప్రమోషన్ లో భాగంగా పుదు మెట్రో రైల్ అనే వీడియో సాంగ్ ని విడుదల చేసింది యూనిట్. 2 నిమిషాలకు పైగా ఉన్న ఈ పాటలో తమిళ్ తంబీలు విక్రమ్ ను చూస్తారేమో కానీ మన ఫోకస్ మాత్రం సహజంగానే కీర్తి సురేష్ వైపే మళ్లుతుంది.
విచిత్రంగా కీర్తి సురేష్ గ్లామరస్ గా బదులు బొద్దుగా ఇంకా చెప్పాలంటే మాస్ గా కనిపించడం విశేషం. విదేశీ లొకేషన్ తో పాటు స్టైలిష్ గా ఉన్న విక్రమ్ అంతా బాగానే ఉన్నా కీర్తి మాత్రం కాస్త ఒళ్ళు చేసి డాన్స్ చేసేందుకు కొంత ఇబ్బంది పడటం గమనించవచ్చు. మొత్తానికి మహానటి చూసిన కళ్ళతో కీర్తిని ఇలా చూస్తుంటే వెరైటీ ఫీలింగ్ రావడం ఖాయం. అంతే కాదు కీర్తి సురేష్ నెక్స్ట్ మూవీ పందెం కోడి 2లో తనది ఇంతకు మించిన మాస్ పాత్ర. ఇటీవలే ఓ అవార్డు ఫంక్షన్ లో ఓవర్ లుక్ అయిన మేకప్ తో ఫ్యాన్స్ కి సైతం చిన్న షాక్ ఇచ్చిన కీర్తి కాస్త స్లిమ్ అవ్వడం గురించి ఆలోచిస్తే బెటరేమో. ఇదిలా ఉంచితే ఈ పుదు మెట్రో రైలు పాట మాత్రం రెగ్యులర్ దేవిశ్రీప్రసాద్ టైపు లో కొత్తదనం అంటూ చెప్పడానికి ఏమి లేకుండా ఉంది. హరి తీసిన సామీ సింగం సిరీస్ తరహాలోనే యాక్షన్ మొదలుకుని మ్యూజిక్ దాకా అన్ని అదే దారిలో వెళ్తున్నాయి. మరి ఫలితం వాటికి తగ్గట్టు వస్తుందా లేదా అనేది సెప్టెంబర్ 21న తేలిపోతుంది.
Full View