#మహానటి మూడేళ్ల తర్వాత పబ్లిసిటీ పిచ్చి ముదిరి..!
మహానటి గా తెలుగు - తమిళ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న కీర్తి ప్రముఖ నటి మేనక కుమార్తె అన్న సంగతి తెలిసిందే. పుట్టుకతోనే తనలోని కళాభినయం బయటపడింది. ఆ తర్వాత బుడి బుడి అడుగుల వేళ బాలనటిగా అద్భుత విన్యాసాలు చేసింది. యుక్తవయసు వచ్చాక కథానాయిక అయ్యింది. ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా కెరీర్ ని సాగిస్తోంది. ఈ జర్నీ ఎంతో ఇంట్రెస్టింగ్ అంటోంది కీర్తి.
కీర్తి అందచందాలు నటనాభినయం ప్రతిదీ సౌత్ ఆడియెన్ కి పిచ్చిగా నచ్చేశాయి. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలోనూ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం మహేష్ సరసన సర్కార్ వారి పాట చిత్రంలో నటిస్తోంది. తదుపరి పలు భారీ చిత్రాలకు సంతకాలు చేసేందుకు సిద్ధమవుతోందని తెలిసింది.
ఇటీవలే నితిన్ సరసన నటించిన రంగ్ దే రిలీజైంది. ఈ సినిమా సెట్స్ లో కీర్తి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా యంగ్ టీమ్ తో ప్రమోషన్స్ సాగించిందో చూస్తున్నదే. ఇక రంగ్ దేకి పాజిటివ్ టాక్ వచ్చాక మరింతగా ప్రచారం చేస్తోంది కీర్తి. నితిన్ తో కలిసి రొమాంటిక్ వీడియోల్ని షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
``మూడేళ్ల తర్వాత పబ్లిసిటీ పిచ్చి ముదిరింది`` అంటూ తాజాగా ఓ స్టన్నింగ్ ఫోటోని కీర్తి షేర్ చేసింది. వెండితళుకులతో మెటాలిక్ చీరలో కీర్తి అందచందాలు పదింతలు ఎలివేట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది. రజనీకాంత్ - అన్నాథే.. మలయాలంలో మరక్కార్ .. గుడ్ లక్ సఖీ.. వాషి.. సాని కాయిధమ్.. లాంటి క్రేజీ చిత్రాలతో కీర్తి క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.