కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో సినీ ఇండస్ట్రీ బంద్ అయింది. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించినా కూడా జనాలు సినిమా థియేటర్స్ కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని పరిస్థితులలో నిర్మాతలు తమ చిత్రాలని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలుగులో ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అయింది. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా మే 29న ఓటీటీలో రాబోతోందని అఫిసియల్ గా ప్రకటించారు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన హిందీ చిత్రం 'గులాబో సితాబో' మరియు విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శకుంతల దేవి' కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే కన్నడ 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ' కూడా ఓటీటీలలో రిలీజ్ అవబోతున్నాయి. మలయాళ 'సూపియుమ్ సుజాతయుమ్' సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. దీంతో దాదాపుగా అన్ని ఇండస్ట్రీస్ ఓటీటీ రిలీజులకు మొగ్గుచూపుతున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పుడు మరో తెలుగు సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది.
తాజాగా 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’చిత్రాన్ని ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. తమిళం మరియు తెలుగు వర్షన్లను ఒకేసారి విడుదల చేయడానికి సదరు ఓటీటీ తో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఈ వేసవికి ‘పెంగ్విన్’ విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. దీంతో ఓటీటీ రిలీజ్ కి వెళ్తున్నారు. థియేటర్స్ రిలీజ్ ప్రకటించి.. ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతున్న ఫస్ట్ క్రేజీ మూవీగా 'పెంగ్విన్' నిలవనుంది. 'పేట' 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ - కార్తికేయన్ సంతానం - కాల్ రామన్ - ఎస్.సోమసేగెర్ - కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ లేడీగా కనిపించనుందని టాక్. ఏదేమైనా నిర్మాతలందరూ లాక్ డౌన్ వల్ల ఓటీటీ లకే ఓటేస్తున్నారు. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో లాక్ డౌన్ కారణంగా మరిన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ కాకుండానే డిజిటల్ కి వచ్చేట్లున్నాయి.