టాక్: చాలా చాలా ఆలోచిస్తోందే

Update: 2018-06-01 23:30 GMT
టాలీవుడ్ లో అఫర్ వచ్చిందంటే చాలు ప్రస్తుతం నార్త్ నటీమణులు అయినా కూడా ఫాస్ట్ గా సినిమాలను ఒకే చేసేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంటే చాలు. ఏ మాత్రం నో చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం కైరా అద్వానీ మంచి లీడ్ లో ఉంది. సౌత్ లో ఉండే చాలా మంది హీరోయిన్స్ తెలుగు సినిమాలకే ఎక్కువగా ఒకే చెబుతున్నారు. అయితే ఎవరు ఎలా ఒకే చేసిన కీర్తి సురేష్ మాత్రం తొందరపడటం లేదు. ఇంకా చాలా సినిమాలు చేయాలనీ అంటున్న ఈ 25 ఏళ్ల సుందరి స్టార్ హీరోతో అయినా నచ్చితేనే చేస్తా అంటోంది.

కథ మరియు పాత్ర లకు సంబందించిన మ్యాటర్ స్ట్రాంగ్ గా లేకుంటే చేయనని చెప్పొస్తోందట. టాలీవుడ్ లో ఒకసారి అజ్ఞాతవాసి సినిమాతో అమ్మడికి ఆల్ రెడీ దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. పక్కాగా హిట్ అవుతుంది అనుకున్న ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో కీర్తి కెరీర్ కష్టకాలంలో పడిందనే టాక్ వచ్చింది. పైగా గ్లామర్ పాత్రలు చేయని ఈ బ్యూటీకి సక్సెస్ లేనిదే ఆఫర్స్ ఎలా వస్తాయని కూడా రూమర్స్ వచ్చాయి.

అయితే మహానటి సినిమాతో అమ్మడు కరెక్ట్ సమాధానం చెప్పింది. అదృష్టవశాత్తు వచ్చిన ఆ అవకాశాన్ని కరెక్ట్ గా వాడుకొని ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కు దక్కని అదృష్టాన్ని దక్కించుకుంది. సినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంది లాభాలను అందించింది. దీంతో వరుసగా టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ కీర్తి మాత్రం తొందరపడం లేదు. ఎంత పెద్ద సినిమా అయినా కూడా అలోచించి నిర్ణయం తీసుకుంటుందట. రాజమౌళి మల్టి స్టారర్ లో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది గాని అది ఎంతవరకు నిజమో తెలియదు. ప్రస్తుతానికైతే ఈ కేరళ బ్యూటీ తమిళ్ సినిమాలనే చేస్తోంది.


Tags:    

Similar News