దివంగత నట దిగ్గజం సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మహానటి షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముందు చెప్పినట్టుగా మార్చ్ 29న విడుదల కావడం లేదనేది దాదాపు ఖరారైనట్టే. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా గురించి పలు రకాల అనుమానాలు, సందేహాలు ప్రారంభమైన నాటి నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. సీనియర్ నటి - సావిత్రి గారితో ఎంతో చనువు ఉన్న జమున గారు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి, టైటిల్ రోల్ చేస్తున్న కీర్తి సురేష్ గురించి గట్టి కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. సావిత్రితో అత్యంత చనువున్న నన్ను సంప్రదించకుండానే సినిమాను తీస్తున్నారని, పైగా బాష రాని వాళ్ళతో తీసి ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని కాస్త ఘాటుగానే ప్రశ్నించారు.
దీనికి నేరుగా జమున గారిని ఉద్దేశించినట్టు కాకుండా కీర్తి సురేష్ ఇన్ డైరెక్ట్ గా బదులు చెప్పే ప్రయత్నం చేసింది. తాను సావిత్రి గారి గురించి పూర్తిగా స్టడీ చేసాకే ఒప్పుకున్నానని, మొదలు పెట్టడానికంటే ముందే ఆవిడ నటించిన సినిమాలు, తన జీవితం గురించి వచ్చిన పుస్తకాలు అన్ని చూసి చదివి అవగాహన పెంచుకున్న తర్వాతే ఒప్పుకున్నానన్న కీర్తి సురేష్ సినిమా చూసాక కామెంట్ చేయండని అడుగుతోంది. సావిత్రి గారి అమ్మాయి చాముండేశ్వరి గారిని కూడా కలిసి వారి జీవిత విశేషాలు - నడవడిక - బాడీ లాంగ్వేజ్ అన్ని తెలుసుకుని దానికి తగ్గట్టే సిద్ధపడ్డానని వివరణ ఇచ్చింది.
అచ్చం సావిత్రి గారిలాగే తనకు కొన్ని అభిరుచులు ఉన్నాయని, క్రికెట్-డ్రైవింగ్-స్విమ్మింగ్ ఇలాంటి వాటి పట్ల తనకు కూడా ఆసక్తి ఉందన్న కీర్తి తనకు ఆ పాత్ర పోషించేందుకు పూర్తి అర్హత ఉందని చెబుతోంది. కీర్తి చెప్పినట్టు విడుదల అయ్యాకే కామెంట్ చేయటం సబబే. ఏ మాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడడానికి సీనియర్లు రెడీగా ఉంటారు. ఇంత నమ్మకంగా చెబుతోంది అంటే మహానటిలో విషయం చాలానే ఉన్నట్టుంది.