ఇప్పుడందరి కళ్లు కీర్తి సురేష్ మీదే. ఈ మధ్య కాలంలో మిగతా హీరోయిన్ల కంటే ఆమె గురించే చర్చిస్తున్నారందరూ. కారణం ఆమె సావిత్రిగా నటించడమే. ఎంతో మందిని వెతికి చివరకు సావిత్రిగా కీర్తి సురేష్ ఎంచుకుంది నాగ్ అశ్విన్ టీమ్. అందుకు ఆమెను ఒప్పించి... భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆమె అందుకున్న పారితోషికం సమంత కాజల్ వంటి స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్‌లో సమానంగా ఉందట.
నాగఅశ్విన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు సావిత్రి బయోపిక్. అందులో సావిత్రి పాత్రధారి కోసం వెతికి వెతికి కాస్త పోలికలున్న కీర్తి సురేష్ ను తీసుకున్నారు. అప్పట్లో ఈ ఎంపికపై చాలా విమర్శలు వచ్చాయి. అలనాటి నటి జమున అయితే బహిరంగంగాన విమర్శించింది. కీర్తికి ఏం అర్హత ఉందని సావిత్రిగా నటిస్తోందంటూ కామెంట్ చేసింది. దానికి కీర్తి కూడా ఘాటుగానే స్పందించింది. మొత్తమ్మీద అవన్నీ సద్దుమణిగిపోయి సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. మరో రెండు రోజుల్లో మహానటి సినిమా థియేటర్లలోకి రానుంది. అందుకే నాగ అశ్విన్ సినిమా ప్రమోషన్‌ను వేగవంతం చేశాడు. ఇప్పటి వరకు విడుదలై టీజర్లు పోస్టర్లు ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
ముఖ్యంగా కీర్తి సురేష్ లుక్ సావిత్రిలాగా అనిపించడంతో సినీ జనాల్లో మరింతగా ఆసక్తి పెరిగింది. లుక్స్ పరంగా కీర్తి మహానటి సినిమాకు న్యాయం చేసిందని మెచ్చుకుంటున్నారు చాలా మంది. ఇక మిగిలింది నటన. మే 9న సినిమా విడుదలయ్యాక అది కూడా తేలిపోతుంది. ఈ సినిమాకు కీర్తిని ఒప్పించేందుకు దాదాపు కోటిన్నర రూపాయలు ఇచ్చిందట సినిమా యూనిట్. ఇంతమొత్తం పారితోషకంగా అందుకోవడం కీర్తి సురేష్ ఇదే తొలిసారి. ఈ సినిమా తరువాత కోటిన్నర హీరోయిన్ల జాబితాలో ముందుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాప్ రేంజ్‌లో ఉన్న సమంతనే అంత మొత్తాన్ని అందుకుంటోంది. కాజల్ కూడా సినిమాకు కోటిన్నరే తీసుకుంటోంది.