కీర్తిని అలా చూసి ఇలా చూడటమెలా?
ఎవరైనా నటి తమ కెరీర్ లో విలక్షణమైన పాత్రల్లో నటిస్తేనే గుర్తింపు. గ్లామర్ ని ఒలకబోసే పాత్రలతో పాటు డీగ్లామరస్ పాత్రలకు అంగీకరించాకే అసలు ట్యాలెంట్ బయటపడుతుంది. ఇక కీర్తి సురేష్ లాంటి గొప్ప నటి మహానటిగా అభినయించగలదు. సర్కార్ వారి గాళ్ ఫ్రెండ్ గా కనిపించగలదు.. అలాగే విలేజీ డీగ్లామ్ డాళ్ లా కూడా మెరవగలదు.
కీర్తి సురేష్ ఎంతో గ్లామరస్ లుక్ తో కనిపిస్తున్న సర్కార్ వారి పాట మరో వారంలో విడుదలకు సిద్ధమవుతుంటే.. మరోవైపు కీర్తి డీగ్లామరస్ రోల్ లో నటించిన `సాని కాయిదం` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ- ``ఇంత తీవ్రమైన చిత్రంలో నన్ను నేను ఊహించలేదు`` అని తెలిపింది.
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ను నటుడిగా పరిచయం చేయడమే కాకుండా.. సాని కాయిధమ్ లో కీర్తి సురేష్ ఇంతవరకు ప్రేక్షకులు చూడని విభిన్న పాత్రలో కనిపించనుంది. సెల్వరాఘవన్ తో స్క్రీన్ స్పేస్ ను పంచుకుంటూ కీర్తి అన్యాయానికి గురైన యువతి గా.. తరతరాల శాపంలో చిక్కుకున్న పూని అనే యువతి పాత్రలో కనిపించనుంది.
ఇది రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ. కీర్తి సరికొత్త పాత్రను పోషించడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేవిధంగా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం కీర్తి ముందస్తు ప్రిపరేషన్ గురించి మాట్లాడింది. గతంలో మనోహరంగా - బబ్లీగా ఉండే పాత్రలను పోషించాను. కానీ ఈ చిత్రంలో పచ్చిగా రాగా ఉండే పాత్రలో నటించాను. సన్నగా నీచంగా కనిపించాల్సిన పాత్ర ఇది. ప్రిపరేషన్ పరంగా నేను నిజంగా ఏమీ చేయలేదు. నేను ఆ దుస్తులు ధరించి మేకప్ వేసుకుని సెట్ కి వెళ్లి మాటాడోర్ వ్యాన్ దగ్గర నిలబడి అరుణ్- సెల్వ సర్ లను చూసేదానిని. నేను సిద్ధంగా ఉన్నాను.. అని చెప్పేదానిని అని తెలిపింది.
ఇంత గంభీరమైన చిత్రంలో ఇలాంటి పాత్రలో నటిస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. కాబట్టి మొదట్లో ఆ పని చాలా కష్టంగా అనిపించింది. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ సెట్స్‌లోని సులువైన వాతావరణం కారణంగా పొన్ని పాత్రను చేయడం నాకు ఈజీ అయింది. మరింత మెరుగుపరచడానికి .. ప్రయోగం చేయడానికి దర్శకుడు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు.. అని తెలిపింది.
స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించిన సాని కాయిదం మే 6న ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితం కానుంది. ఈ సినిమా తెలుగులో చిన్ని పేరుతో.. మలయాళంలో సాని కాయిదం పేరుతో విడుదల కానుంది. అయితే సర్కార్ వారి పాటలో అలా చూసిన ఆడియెన్ ఇప్పుడు సాని కాయిదంలో కీర్తిని ఇలా చూడగలరా? అన్నది వేచి చూడాలి.