రేప్ చేస్తామంటూ బన్నీ ఫ్యాన్స్ హెచ్చరికలు?

Update: 2018-05-11 11:00 GMT

 సోషల్ మీడియాలో ట్రాలింగ్ ఎంత కామన్ అయిపోయిందో.. బెదిరింపులు కూడా అంతే సహజం అయిపోతున్నాయి. కేరళలో అయితే.. ఓ నటిని రేప్ చేయించేదుకు స్టార్ హీరో దిలీప్ ప్రయత్నించాడనే కేసు నడుస్తోంది. ఈ ఉదంతం నుంచి.. ఆయా హీరోల అభిమానులు కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు.

ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ విషయంలో కూడా ఇలాంటి బెదిరింపులే వినిపిస్తున్నాయి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల అయింది. అక్కడ బన్నీకి మంచి మార్కెట్ ఉండగా.. ఈ సినిమాకు ఇక్కడి మాదిరిగానే యావరేజ్ రివ్యూలే వచ్చాయి. అపర్ణ ప్రశాంతి అనే ఓ జర్నలిస్ట్ రాసిన నెగిటివ్ రివ్యూ కారణంగా.. అక్కడి అభిమానులు అనేక మంది ఆమెను బెదిరిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టడం మొదలుపెట్టారు. రేప్ చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

దీనిపై ప్రశాంతి ఇప్పటికే సైబర్  సెల్ కు కూడా ఫిర్యాదు చేసింది. నిజానికి కేరళలో దాదాపు అందరు రివ్యూ రైటర్ల మాదిరిగానే ఈమె రివ్యూ కూడా ఉంది. కానీ మహిళ కావడంతోనే ఈమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీన్ని హీరోలు కూడా ఖండించాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజానికి రివ్యూలు ఓ వ్యక్తి అభిప్రాయం మాత్రమే. అవి సినిమా జయాపజయాలను నిర్ణయించలేవనే విషయం గతంలోనే నిరూపితం అయింది.


Tags:    

Similar News