బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'కేసరి' హోలీ పండగ సందర్భంగా నిన్న రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఆడియన్స్ లో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ ఏడాదికి గానూ ఇప్పటివరకూ రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.
ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్నీ తెలిపాడు. "కేసరి గర్జన. బాక్స్ ఆఫీస్ ను దడదడలాడించి 2019 లో బిగ్గెస్ట్ ఓపెనర్ (ఇప్పటి వరకూ) నిలిచాడు. ఉదయం.. మధ్యాహ్నం(హోలీ కారణంగా) లిమిటెడ్ షోస్ ఉన్నప్పటికీ.. 3pm/4pm తర్వాత కలెక్షన్స్ భారీగా నమోదయ్యాయి.. ఇండియాలో గురువారం నాడు ఈ చిత్రం రూ. 21.5 కోట్లు కలెక్షన్ నమోదు చేసింది" అంటూ ట్వీట్ చేశాడు.
ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అనురాగ్ సింగ్. సారాగడి యుద్ధం(1897) ఆధారంగా తెరక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కు కూడా భారీ స్పందన దక్కుతోంది. పోటీలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా భారీ విజయం దిశగా పయనించడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.