కేశవ.. కొట్టాడబ్బా

Update: 2017-06-10 07:44 GMT
‘‘గొప్పగా.. కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు.. బాధ’’ నిఖిల్ హీరోగా నటించిన కేశవ ట్రైలర్ స్టార్టింగ్ డైలాగులివి. మామూలు రివెంజ్ డ్రామానే డైరెక్టర్ సుధీర్ వర్మ ఆకట్టుకునేలా తీయడంతో కేశవ జనాలకు బాగానే నచ్చాడు. బాహుబలి-2 కలెక్షన్లు పీక్ లో ఉండగా సినిమా కేశవ థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమా కావడంతో హడావుడి లేకుండానే రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్ లు బాగుండటంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. సినిమా బాగుందనే టాక్ తో కలెక్షన్లు స్టడీగా సాగాయి.

కేశవ మొత్తం రూ. 14 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 6 కోట్లు మాత్రమే కావడం విశేషం. కేవలం ముప్ఫై రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. నైజాం రూ. ఆరు కోట్లు - ఆంధ్రాలో రూ. 4 కోట్లు సీడెడ్ లో రూ. 0.9 కోట్ల కలెక్షన్లు వసూలయ్యాయి. ఓవర్సీస్ లో రూ. కోటి వసూలైంది. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారానే రూ. 3.5 కోట్లు నిర్మాత అభిషేక్ కు లభించాయి. హిందీ డబ్బింగ్ - కర్ణాటక నుంచి రూ. కోటిన్నర పైగా వసూలైంది. మొత్తంమీద రూ. 6 కోట్ల లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఫిలిం నిర్మాతకు రూ. 14 కోట్ల దాకా ఆదాయం తెచ్చిపెట్టిందన్న మాట. అదీ అతి తక్కువ టైంలో.

వరస హిట్లతో దూసుకుపోతున్న నిఖిల్ కు కేశవ హిట్ మరింత ఉత్సాహాన్నిచ్చింది. మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్ స్ర్కీన్లలోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. పెళ్లిచూపులు ఫేం రీతూవర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News