ఎంతైనా గ్లామర్ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డే. వేరే రంగాల్లో పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్లకు కూడా ఈ ఫీల్డ్ లో ఓ రాయి వేసి చూడాలన్న ఆశ ఉంటుంది. ఫుల్ టైం ప్రొడక్షన్ లోకి దిగకున్నా.. కనీసం ఓ సినిమా అయినా తీసి సరదా తీర్చుకోవాలని చూస్తుంటారు వేరే రంగాల వాళ్లు. ఇందుకు రాజకీయ నాయకులు కూడా మినహాయింపు కాదు. ఇంతకుముందు వైఎస్ హవా సాగుతున్నరోజుల్లో ఆయన బామ్మర్ది - కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి.. ప్రభాస్ కథానాయకుడిగా ‘యోగి’ అనే భారీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఐతే మళ్లీ ప్రొడక్షన్ లోకి రాలేదాయన. కొడాలి నాని - వల్లభనేని వంశీ కూడా ‘అదుర్స్’ సినిమాతో ఓ రాయి వేశారు. ఆ సినిమా విజయవంతమైనా మళ్లీ ఇటువైపు రాలేదు.
ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని చూపు కూడా సినిమాల మీద పడింది. ఐతే పైన చెప్పుకున్న వాళ్ల లాగా ఊరికే అలా ఓ రాయి వేసి వెళ్లిపోవడం కాకుండా పూర్తి స్థాయిలో సినిమాల్లోకి దిగాలని చూస్తున్నారట నాని. ఇందుకోసం జూబ్లీహిల్స్ లో ఆఫీస్ కూడా తెరిచారు నాని. ఆయన కుటుంబ సభ్యులే సినిమాల నిర్మాణం చూడబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ జనాలతో నానికి మంచి పరిచయాలే ఉన్నాయి. కొందరు పెద్ద దర్శకులు - హీరోలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఇంకొన్ని నెలల్లోనే నాని సంస్థలో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.