విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు పేరు తెలియని తెలుగు వారుండరు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి స్వశక్తితో గొప్ప నటుడిగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తెలుగు తేజం. ఎన్టీఆర్ జీవిత గాథతో తేజ డైరెక్షన్ లో సినిమా తీయడానికి ఆయన తనయుడు - హీరో బాలకృష్ణ సిద్ధం అవుతున్నారు.
బాలకృష్ణ సినిమా ఇంకా ప్రారంభం కాకముందే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను సైతం ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తానని అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఏం జరిగందనే కథతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఇది కచ్చితంగా సంచలనం అవుతుందని అందరిలో ఉత్సుకత రేపుతున్నారు. ఈ రెండింటి కథ ఇలా ఉంటే తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మరో దర్శకుడు ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేస్తానని ప్రకటించాడు. లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో ఈ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు. లక్ష్మీపార్వతి పాత్రకు వాణి విశ్వనాథ్ లేదా రాయ్ లక్ష్మిలలో ఎవరో ఒకరిని తీసుకునే ఆలోచన ఉందని చెప్పారు.
తాను లక్ష్మీపార్వతి కోణం నుంచి సినిమా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ముందే ప్రకటించాడు. ఇదే టైంలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తాను తీసే సినిమా టైటిల్ ద్వారా ఇది ఆర్.జి.వి. కాన్సెప్ట్ కు వ్యతిరేకంగా తీస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. ఏదేమైనా ఒక నటుడి జీవితంపై ఒకే టైంలో మూడు సినిమాలు తెరకెక్కడానికి రంగం సిద్ధమవడం అరుదే. ఆ రకంగా ఎన్టీఆర్ ఇంకో ఘనత సాధించారనే చెప్పొచ్చు. చూద్దాం.. వీరిలో ఎవరు ముందుగా క్లాప్ కొడతారో?