‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా విషయమై లక్ష్మీపార్వతి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తీయనిచ్చేది లేదంటూ హెచ్చరిస్తున్న ఆమె.. ఫ్లాట్ ఫాం గాళ్లు తన మీద సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పందించాడు. తమను ఫ్లాట్ ఫాం గాళ్లు అంటున్న లక్ష్మీపార్వతి.. ఏ రాజమహల్ నుంచి వచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించాడు. లక్ష్మీపార్వతిపై ఆయన తీవ్ర స్థాయిలోనే ఎదురుదాడి చేశాడు.
‘‘నన్ను.. నా నిర్మాతను ప్లాట్‌ఫార్మ్ గాళ్లు అన్న లక్ష్మీపార్వతి.. ఏ రాజమహల్ నుంచి వచ్చిందో ప్రజలకు చెప్పాలి. ఆమె పుట్టిన గుంటూరు జిల్లా బచ్చల తాటిపర్రులో బహిరంగ చర్చకు నేను సిద్ధం. ఆమె సిద్ధమా! నా సినిమా షూటింగుని పోలీసులు అడ్డుకుంటే.. తానే ఆపించినట్లు చెబుతోంది. ఆమె మా ముందు ఒక రకంగా.. మీడియా ముందు మరో రకంగా మాట్లాడుతోంది. అన్నగారి ధర్మపత్నిని అని చెప్పుకునే ఆమె భాష.. కల్చర్ చాలా దిగజారుడు స్థాయిలో ఉన్నాయి. అన్నగారిపై వెకిలి సినిమాలు తీస్తేనే ఆయన నవ్వుతూ స్వీకరించేవారు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం ఆమె ఒరిజినల్ కారెక్టర్ చూపిస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇకనైనా ద్వంద్వ నీతిని మార్చుకుని.. అన్నగారి పరువు ప్రతిష్టలను కాపాడాలి. లక్ష్మీపార్వతి కేసీఆర్ గారికి కంప్లైంట్ ఇస్తాను అని బెదిరిస్తున్నారు. మీరు వెళ్లేటప్పుడు నన్ను పిలవండి. నా వద్ద ఉన్న ఆధారాల్ని ఆయన సమక్షంలో చూపిస్తా’’ అని కేతిరెడ్డి అన్నాడు.