రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో పబ్లిసిటీ కోణం కూడా ఉంటుందనేది కూడా వాస్తవమే. కానీ ఆ విషయాన్ని వర్మే ఒప్పుకుంటాడు. పబ్లిసిటీ కోసం చేసినా జనాల దృష్టిని ఆకర్షించడంలో వర్మ స్టైలే వేరుగా ఉంటుంది. కానీ వర్మ రూట్లో సాగే అందరికీ వాళ్లు ఆశించిన ప్రయోజనం దక్కదు. వర్మ లాంటోడు ఒక్కడే ఉంటాడు. వర్మను అనుకరించే ప్రయత్నం చేస్తే అభాసుపాలు కాక తప్పదు. ఇందుకు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డే ఉదాహరణ. రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అనౌన్స్ చేశాడు కాబట్టి.. దీనికి పోటీగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను ప్రకటించాడు కేతిరెడ్డి. ఈ సినిమా టైటిల్.. దీని ప్రి లుక్ పోస్టర్ చూస్తేనే జనాలకు ఒక చీప్ ఫీలింగ్ కలిగింది.
ఇది చాలదన్నట్లు ఈ సినిమా విషయంలో ప్రతి విషయాన్ని పబ్లిసిటీకి వాడుకోవాలని చూడటం టూమచ్ గా అనిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో నటీనటులెవరో చెప్పకుండానే మొన్న షూటింగ్ అన్నాడు కేతిరెడ్డి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన చేసిన హడావుడంతా కేవలం పబ్లిసిటీ కోసమే అని జనాలకు అర్థమైంది. ఆయన తీరు విమర్శల పాలైంది. అది చాలదన్నట్లుగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రకు ఆయన రోజుకో పేరు ప్రకటిస్తుండగా.. ఆ పేర్లు చూసి జనాలకు దిమ్మదిరుగుతోంది. ముందుగా వాణీ విశ్వనాథ్ పేరెత్తినపుడే జనాలకు మతిపోయింది. ఆ తర్వాత సన్నీ లియోన్ అని.. లక్ష్మీ రాయ్ అని.. ఐశ్వర్యారాయ్ అని.. అర్థం లేని రీతిలో రోజుకో పేరు చెబుతున్నాడు కేతిరెడ్డి. లక్ష్మీపార్వతి పాత్ర కోసం వీళ్లతో సంప్రదింపులు జరుపుతానని.. కొందరితో ఆల్రెడీ చర్చలు జరిగాయని అంటున్నాడాయన. ఇలాంటి మాటలు చూశాక జనాలకు ఈ సినిమాపై ఎలాంటి భావన కలుగుతుందో చెప్పేదేముంది?