రొమాంటిక్ బ్యూటీ అల్ట్రా స్టైలిష్ లుక్

Update: 2021-11-12 23:30 GMT
ఆకాష్ పూరి సరసన `రొమాంటిక్` చిత్రంతో న‌వ‌త‌రం బ్యూటీ కేతిక తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ముంబై లో మోడల్ గా కెరీర్ ని సాగిస్తున్న కేతిక పూరి కంట్లో ప‌డింది. ఆడిష‌న్స్ లోమెప్పించి వెంట‌నే క‌థానాయిక‌గా ఆఫ‌ర్ అందుకుంది. ఇక ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాల్లో చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది. కేతిక శ‌ర్మ మోడ‌ల్ గా.. టీవీ న‌టిగా సుప‌రిచితం. కేతిక‌ ఇన్ స్టాగ్రమ్ లో స్పీడ్ గానే ఉంది. నిరంతరం సోష‌ల్ మీడియాల్లో కొత్త ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌ను పెంచుకుంటోంది.

ఇటీవ‌ల `కిచెన్ డైరీస్` పేరుతో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ ల‌ను కేతిక షేర్ చేస్తోంది. ఇక రొమాంటిక్ చిత్రంలో కేతిక అందాల ఆర‌బోత న‌ట‌న‌కు కాంప్లిమెంట్లు ద‌క్కాయి. డెబ్యూ న‌టి అయినా ఎలాంటి బెరుకు లేకుండా అమ్మ‌డు రొమాన్స్ ని అద‌ర‌గొట్టింద‌ని కితాబు ఇచ్చేసింది యూత్.

డెబ్యూ మూవీ రొమాంటిక్ ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోయినా టాలీవుడ్ లో కేతిక‌కు ఇంకా చాప్ట‌ర్ క్లోజ్ అవ్వ‌లేదు. ఈ బ్యూటీకి వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని తెలిసింది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ కేతిక‌కు అవ‌కాశాలొస్తున్నాయి. నాగ శౌర్య స‌ర‌స‌న ల‌క్ష్య‌ చిత్రంలో కేతిక న‌టిస్తోంది. ఇటీవ‌ల దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేసిన కేతిక- శౌర్య జంట‌ పోస్ట‌ర్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. యంగ్ డిల్లీ బ్యూటీ కేతిక‌ తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. బ్లాక్ టాప్ పై అలా ఎల్లో సూట్ ని క‌వ‌ర్ చేస్తూ కేతిక ఎంత అందంగా ఫోజిచ్చింది.
Tags:    

Similar News