కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 ఏ స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సిరీస్‌లలో వచ్చిన రెండ పార్ట్ ఊహించని విధంగా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఏకంగా ఈ మూవీ రూ. 400 కోట్లు అవలీలగా వసూలు చేయడం విశేషం.
పార్ట్ 2 ఎండింగ్ లో పార్ట్ 3కి లీడ్ వదిలిన దర్శకుడు మూడవ బాగంపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. చాప్టర్ 1 ని మించి చాప్టర్ 2 వుండటంతో ప్రేక్షకులు చాప్టర్ 3 మరిన్ని ప్రత్యేకతలతో వుంటుందని అప్పుడే ఊహల్లో తేలిపోతున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ సినిమా వుంటుంది. ఆ తరువాతే 'కేజీఎఫ్ 3' వుండే అవకాశం కనిపిస్తోంది.
ఈ విషయం పక్కన పెడితే 'కేజీఎఫ్' నటుడు హరీష్ రాయ్ సాయం కావాలంటూ ప్రకటించడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లలో హీరో యష్ పాత్రకు సపోర్ట్ గా నిలుస్తూ తనకు మానసిక ధైర్యాన్ని అందించే కరీమ్ చాచా పాత్ర గుర్తుందా? .. యస్ ఆ పాత్రలో నటించిన వ్యక్తే హరీష్ రామ్. గత కొంత కాలంగా త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం నాలుగవ స్టేజ్ కి రావడంతో దీనికి సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారట.
ఢిల్లీలోని కిడ్వాయ్ హాస్పిటల్ లో ఆయన ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఇప్పటికే ఆయనకు లంగ్స్ కి సంబంధించిన సర్జరీ జరిగనట్టుగా తెలుస్తోంది. ఆయితే మరింతగా ఆయనకు ట్రీట్ మెంట్ అవసరమని డాక్టర్లు సూచించారట. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ రాయ్ మాట్లాడుతూ కర్మని ఎవరూ తప్పించుకోలేరు. గత మూడేళ్లుగా నేను క్యాన్సర్ తో బాధపడుతున్నాను. నా నెక్ వాపుకు గురవుతూ వస్తోంది. గడ్డం వుండటం వల్ల 'కేజీఎఫ్ 2'లో నటించగలిగాను.
సినిమా రిలీజ్ తరువాత సర్జరీ చేయించుకోవాలని వేయిట్ చేశాను. ఆ కారణంగా ఫోర్త్ స్టేజ్ కి వచ్చేసింది' అని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఓ వీడియో లో మాట్లాడిన హరీష్ రాయ్ తన ట్రీట్ మెంట్ కోసం డబ్బులు సహాయం చేయాలని కోరడం పలువురిని కలిచి వేస్తోందట.
ఆ మధ్య ఒక్కడే ఒంటరిగా వచ్చి కొట్టిన వాడే మోన్ స్టర్ అంటూ పార్ట్ 1, పార్ట్ 2 లో రాఖీ భాయ్ గురించి హైప్ క్రియేట్ చేసిన మోహన్ జునేజా అనే నటుడు 'కేజీఎఫ్ 2' రిలీజ్ తరువాత తీవ్ర అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన విషయం తెలిసిందే.