'బాహుబలి' సినిమాలతో సంచలన విజయం సాధించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. జాతీయ స్థాయిలో క్రేజీ తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అయితే ఇప్పుడు 'కేజీఎఫ్ 2' సినిమా నార్త్ బెల్ట్ లో అద్భుతమైన విజయం అందుకోవడంతో.. ప్రభాస్ కంటే యష్ పెద్ద స్టార్ అయ్యాడా? అనే చర్చలు మొదలయ్యాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన 'సాహో' సినిమా హిందీలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ.. మిగతా భాషల్లో అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీని తర్వాత ఇటీవల వచ్చిన 'రాధేశ్యామ్' మూవీ ప్లాప్ అయింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ప్రభాస్ స్టార్‌డమ్ ను కొంచెం దెబ్బతీసిందనే కామెంట్స్ వస్తున్నాయి.
మరోవైపు 'కేజీయఫ్' తో ఊహించని సక్సెస్ అందుకున్న కన్నడ హీరో యష్.. ఇప్పుడు చాప్టర్-2 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో ఈ మూవీ సాలిడ్ వసూళ్ళు రాబడుతోంది. ఐదు రోజుల్లోనే 219 కోట్లకు పైగా కలెక్ట్ చేసి, నార్త్ లో నెం.1 స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో యష్ ఖచ్చితంగా ప్రభాస్ కంటే పెద్ద స్టార్ అయ్యాడని కన్నడిగులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఒక్క పరాజయం వచ్చినంత మాత్రాన తన హీరో రేంజ్ తగ్గిపోయినట్లు కాదని.. రాబోయే సినిమాతో మరోసారి బాక్సాఫీస్ కు తన సత్తా ఏంటో చూపిస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.
'కేజీఎఫ్ 2' తో యష్ ప్రస్తుతానికి ఉత్తరాదిలో అగ్రస్థానంలో ఉండవచ్చని.. అయితే అతని తదుపరి సినిమాలు ఆ స్థాయిలో లేకపోతే మాత్రం క్రేజ్ అంతా ఒక్కసారిగా పోతుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 'బాహుబలి' తో వచ్చిన క్రేజ్ ను కాపాడుకునేలా ప్రభాస్, విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలన్నీ అత్యధిక బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. అంతేకాదు ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్నన్ని పెద్ద ప్రాజెక్ట్స్ మరో హీరో వద్ద లేవని అనడంలో అతిశయోక్తి లేదు. అలానే డార్లింగ్ అంత రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో కూడా మరొకరు లేరు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నాయి. ప్రభాస్ స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో 'ఆదిపురుష్' మరియు 'సలార్' వంటి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు నార్త్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అపూర్వమైన విజయాన్ని సాధిస్తాయని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇదే జరిగితే ప్రభాస్ దేశంలోని తిరుగులేని స్టార్ గా స్థిరపడే అవకాశం ఉంది.
ఇక ప్రభాస్ లైనప్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K' అనే పాన్ వరల్డ్ మూవీ.. సందీప్ రెడ్డి వంగా తో చేయాల్సిన 'స్పిరిట్' అనే పాన్ ఇండియా చిత్రం ఉంది. మరోవైపు గత నాలుగేళ్లుగా 'కేజీఎఫ్' ప్రాంఛైజీకి అంకితమైన యష్.. తదుపరి ప్రాజెక్ట్ ని ఏ డైరెక్టర్ తో చేస్తాడనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.