కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ ఆల్ ఓవర్ ఇండియాలో మంచి సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. భారీ యాక్షన్ చిత్రంగా కేజీఎఫ్ దక్కించుకున్న సక్సెస్ కన్నడ సినిమా పరిశ్రమలో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచి బాలీవుడ్ రేంజ్ లో కూడా టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కేజీఎఫ్ కు సీక్వెల్ పూర్తి అయ్యింది. కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. గత ఏడాది నుండి ఈ సినిమా అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదా పడుతోంది. ఈ ఏడాది జులై 16 న కేజీఎఫ్ 2 ను విడుదల చేయాలని నిర్ణయించారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేజీఎఫ్ 2 మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో థియేటర్లు ఎక్కడ కూడా నడుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితి జూన్ జులై వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. థియేటర్లు మళ్లీ పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడానికి ఖచ్చితంగా మరో మూడు నాలుగు నెలల సమయం పడుతుందని అంటున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని పలు సినిమాలు దసరా సీజన్ కు విడుదలకు సిద్దం అవుతున్నాయి.
కేజీఎఫ్ 2 ను కూడా వాయిదా వేసి దసరా కు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి నుండే డేట్ ను బుక్ చేసుకుని పెట్టుకుంటే తప్ప అప్పటి వరకు ఇతర సినిమాలు పోటీగా రాకపోవచ్చు అనేది కేజీఎఫ్ 2 మేకర్స్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే ఒకటి రెండు వారాల్లో సినిమా జులై లో విడుదల చేయడం లేదు దసరా కానుకగా విడుదల చేస్తామని ఒక తేదీని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కేజీఎఫ్ 2 సినిమా భారీగా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం కనుక సేఫ్ జోన్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ముందస్తు ప్లానింగ్ లో ఉన్నారు.