‘ఖైదీ నెంబర్ 150’ సినిమా విడుదలైంది 2017లో. ఐతే ఈ చిత్రాన్ని 2016 జాతీయ అవార్డులకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ సినిమా 2016లోనే పూర్తయి సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకోవడంతో హడావుడిగా ఆ ఏడాది జాతీయ అవార్డులకు పంపినట్లు తెలిసింది. రైతు సమస్యల మీద పోరాటం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ చిత్రానికి జాతీయ అవార్డుల్లో ప్రయారిటీ ఉంటుందని.. ఏదో ఒక అవార్డు ఇస్తారని చిత్ర బృందం భావిస్తోంది. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’ రీమేక్ సినిమా అయిన నేపథ్యంలో అవార్డులకు పరిగణిస్తారా అన్నది డౌట్. ఐతే అవార్డు విషయంలో చిత్ర బృందం మాత్రం కాన్ఫిడెంటుగా ఉందంటున్నారు.
కేంద్ర మంత్రిగా పని చేసి.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్న చిరుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన సినిమాకు అవార్డు తెప్పించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ‘ఖైదీ నెంబర్ 150’కి ఏ కేటగిరిలో అవార్డుకు పరిగణిస్తారు.. అవార్డు ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం అప్పట్లో జాతీయ అవార్డుల్లో ప్రభావం చూపలేకపోయింది. మరి రీమేక్ సినిమాను జ్యూరీ సభ్యులు ఏ కోణంలో చూస్తారో? సంక్రాంతికి భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/