రవితేజ హీరోగా డింపుల్ హయతీ హీరోయిన్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గత ఏడాది క్రాక్ తో సక్సెస్ దక్కించుకున్న రవితేజ వెంటనే ఖిలాడి ని దించాలని భావించాడు. అన్ని అనుకున్నట్లుగా సజావుగా జరిగి ఉంటే ఖిలాడి గత ఏడాది సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కాని కరోనా బ్యాక్ టు బ్యాక్ వేవ్స్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఖిలాడి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఫిబ్రవరి 11న సినిమాను విడుదల చేస్తాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. మొన్నటి వరకు ఆ తేదీన విడుదల సాధ్యం కాకపోవచ్చు అంటూ అంతా భావించారు. కాని కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సినిమాల హడావుడి మొదలు అయ్యింది. కనుక ఖిలాడి సినిమా విడుదల పక్కా అని అనుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం నిర్ణయం వల్ల ఖిలాడి సినిమా వారం ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.
ఖిలాడి సినిమా ను పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 11న విడుదల చేయడం పక్కా.. కాని కాస్త అటు ఇటు అయితే వారం ఆలస్యంగా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కనుక ఖిలాడి విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మరో వైపు ఖిలాడి సినిమా ఓటీటీ హక్కుల విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తాలను ఆఫర్ చేశారట. ఈ సినిమా ను హోల్ సేల్ గా స్టార్ నెట్ వర్క్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ తో పాటు ఓటీటీ రైట్స్ ను కూడా వారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్టార్ మా లోగోలు వేశారు. కనుక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు లేదా అయిదు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అందుతోంది.
ఇటీవలే అఖండ సినిమా ను స్ట్రీమింగ్ చేసిన హాట్ స్టార్ కు మంచి స్పందన దక్కింది. అఖండ రేంజ్ లో మళ్లీ ఖిలాడి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక ఖిలాడి సినిమ వల్ల మరోసారి హాట్ స్టార్ ఓటీటీ ఖాతాదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో జోష్ మీదున్న రవితేజ ఖిలాడి సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా లో అనసూయ పాత్ర అత్యంత విభిన్నంగా ఉంటుందని.. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
రవితేజ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో క్లారిటీ వచ్చినట్లుగా విడుదల విషయంలో మరి కొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఈనెల 14 వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కనుక ఖిలాడి సినిమా తర్వాత విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా ఖిలాడి విడుదల తేదీ లో ఏమైనా మార్పు వస్తుందా అనేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.