ఖుషి రీ రిలీజ్.. ఇదేమి క్రేజ్ బాబోయ్!

Update: 2022-12-29 08:56 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిన సినిమాలలో ఖుషి ఒకటి. 2001లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చుతుంది. ఎన్నిసార్లు చూసినా కూడా ఈ సినిమా బోర్ కొట్టని విధంగా దర్శకుడు ఎస్ జై సూర్య ఈ మూవీని తెరపైకి తీసుకువచ్చాడు. కేవలం ఒక ఈగో క్లాష్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో అయితే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

పెద్దగా యాక్షన్ సన్నివేశాలు హడావిడి లేకుండా చాలా క్యూట్ గా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం నేటి తరం టెక్నీషియన్స్ కు కూడా ఒక మంచి పుస్తకం లాగా నిలిచింది అని చెప్పవచ్చు. అయితే ఖుషి సినిమాను మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత థియేటర్లలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి మంచి క్వాలిటీతో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 31వ తేదీన కేవలం కొన్ని షోలు మాత్రమే వేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత డిమాండ్ మేరకు న్యూ ఇయర్ తర్వాత మరో రెండు రోజులు కూడా ఖుషి సినిమా ధియేటర్లలో సందడి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ బెనిఫిట్ షో లు కూడా ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే డిసెంబర్ 31వ తేదీన ఉదయం 5 గంటలకు అలాగే 6 గంటలకు సినిమా షోలు మొదలయ్యే అవకాశం ఉందట. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఖుషి సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తం గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News