బాత్రూమ్ లో ప‌ద‌హారేళ్ల వ‌య‌సు అమ్మాయి సెల్ఫీ

Update: 2021-08-18 09:42 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా జాన్వీ వెండితెర‌పై వెలుగులు విర‌జిమ్ముతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత జాన్వీ సోద‌రి ఖుషీ క‌పూర్ కూడా సినీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే పాపా బోనీ క‌పూర్ ఆ శుభ‌వార్త‌ను కూడా చెబుతారు.

అయితే ఈలోగానే ఖుషీ క‌పూర్ ఫేజ్ 3 వ‌ర‌ల్డ్ లో ప్ర‌కంప‌నాలు రేపుతోంది. ఈ బ్యూటీ ఏ విందు వినోదానికి వెళ్లినా అక్క‌డ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఓవైపు త‌న అక్క జాన్వీ నుంచి పోటీని ఎదుర్కొంటూనే త‌న‌దైన యూనిక్ స్టైల్ ఎలివేష‌న్ కోసం ఖుషీ పాకులాడుతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. క‌థానాయిక కాబోయే ముందు ఫీల‌ర్స్ వ‌దులుతోందంటూ ఖుషీపైనా పంచ్ లు ప‌డుతున్నాయి.

తాజాగా అనీల్ క‌పూర్ కుమార్తె రియా క‌పూర్ వెడ్డింగ్ లో ఖుషీక‌పూర్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. ఇక పెళ్లి అనంత‌రం విందులో ఖుషీ మ‌రో కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇది చూడ‌టానికి క్యాజువ‌ల్ గా ఉన్నా.. సంథింగ్ స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ తో ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటోంది.పైగా ఇది బాత్రూమ్ సెల్ఫీ కావ‌డంతో గ‌మ్మ‌త్త‌యిన కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు యువ‌జ‌నం.

తప్పనిసరి బాత్రూమ్ సెల్ఫీ పేరుతో ఖుషీ ఈ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయ‌గా...ప‌లువురు ఈ గెట‌ప్ బావుంది.. డ్రెస్ బావుంది అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. నేను నీ చేయి కొరుకుతాను! అంటూ జాన్వీ కొంటెగా ఆట‌ప‌ట్టించింది.

రియా కపూర్ - కరణ్ బూలానీ వివాహం అనంత‌రం నిన్న రాత్రి అనిల్ కపూర్ ఇంట్లో ఒక పార్టీ జరిగింది. ఈ పార్టీలో జాన్వీ కపూర్, .. ఖుషీ కపూర్, షనాయ కపూర్ .. త‌దిత‌రులు హాజరయ్యారు. ఇప్పుడు ఖుషి పార్టీ లోపల నుండి ఫోటోలను షేర్ చేసింది. అయితే అవి బాత్రూమ్ సెల్ఫీలు కావ‌డంతో స్పంద‌న అనూహ్యంగా ఉంది. ఆమె సోదరి జాన్వి ఖుషి ఫోటోలకు సంతోషకరమైన ప్రతిస్పందన వచ్చింది. ఈ ఫోటోలలో ఖుషి తెల్లని దుస్తులలో కనిపిస్తోంది.. త‌న‌ క్లాసిక్ లుక్ పార్టీ క్రౌడ్ ని ఆక‌ర్షించింది. బాత్ రూమ్ మిర్ర‌ర్ సెల్ఫీలలో తన సోదరి మచ్చలేని రూపాన్ని చూసిన జాన్వీ ఆమె చేతిని కొరికి వేయాలనుకుంది. అందుకే `నేను నీ చేయి కొరుకుతాను` అంటూ రిప్ల‌య్ ఇచ్చింది. త‌న ఫ్రెండు షాన‌య కూడా త‌న సెల్ఫీకి స్పందించింది.

రియా- కరణ్ దంప‌తుల‌ పెళ్లి కోసం తన గ్లామరస్ లుక్ నుండి మరిన్ని ఫోటోలను జాన్వీ క‌పూర్ ఇంత‌కుముందే సోషల్ మీడియాలో పంచుకుంది. ఫోటోలలో జాన్వి అనేక భంగిమలతో వేడెక్కించింది. త‌న‌ స్ట్రాప్ లెస్ టాప్ - వైట్ ప్యాంటుతో ఆమె లుక్ కు బ్లింగ్ షైన్ ని జోడించడంతో చాలా అందంగా కనిపించింది. జాన్వీ-ఖుషీ-షాన‌య అంద‌చందాలు డిజైన‌ర్ లుక్ లు ఈ పెళ్లి వేడుక‌కే హైలైట్ గా నిలిచాయి.

పార్టీలో ఫరా ఖాన్- అర్జున్ కపూర్,.. అన్షులా కపూర్, ..అబూ జానీ .. సందీప్ ఖోస్లా,.. మసాబా గుప్తా,.. కునాల్ రావల్, .. అర్పిత మెహతా త‌దిత‌రులు హాజరయ్యారు. రియా -అనిల్ .. తండ్రి-కుమార్తె నృత్యం వీడియోను ఫ‌రాఖాన్ పంచుకున్నారు. ఇది అంద‌రిలో వైర‌ల్ గా మారింది.


Tags:    

Similar News